సల్మాన్ ఖాన్ ఒక మంచి మనస్సున్న వ్యక్తిగా
బాలీవుడ్ లో చెప్పుకుంటారు. అలాంటి సల్మాన్ ఖాన్ కి కష్టాల మీద కష్టాలు వచ్చి
పడుతున్నాయి. గతంలో జింకలను వేటాడిన కేసులో కష్టాలు ఎదుర్కొన్న ఈయన 2002
స్పీడ్ గా కారు నడిపి ఒక మరణానికి, నలుగురు క్షతగాత్రులు అవ్వడానికి కారణమై
ఈయన కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సెక్షన్
304(1)(నిర్లక్ష్యపు డ్రైవింగ్) కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న
దీనిపై , ఈ కేసు విషయంలో, భారతీయ శిక్షాస్మృతిలోని 304(2) కింద విచారణ
జరిగేలా చూడాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి స్థానిక మేజిస్ట్రేట్
కోర్టు గురువారం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులిచ్చింది. కేసును తీవ్రంగా
పరిగణిస్తూ ఈనెల 11న సెషన్స్ కోర్టు ముందు హాజరుకావాలంటూ సల్మాన్ ఖాన్ను
ఆదేశించింది. ఈ సెక్షన్ కింద హత్యతో సమానం కాని శిక్షార్హ నరహత్య
అభియోగాలతో విచారిస్తారు. దీనికింద దోషిగా తేలితే గరిష్ఠంగా పదేళ్ల శిక్ష
పడుతుంది. ఏది ఏమైనా సల్మాన్ కి కష్టాలు మాత్రం వీడటం లేదు.
No comments:
Post a Comment