టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు
తెలుగులోనే కాకుండా పలు బాషల్లో క్రేజ్ ఉంది. ఈయన సినిమా కోసం అభిమానులు
వేయి కళ్ళతో ఎదురుచూస్తారు. ఈయన తాజాగా ప్రేమ కథా చిత్రాల దర్శకుడు
సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దసరా
కానుకగా ప్రేక్షకుల మందుకు తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే షూటింగ్ పూర్తికాక ముందే ఈ సినిమా రైట్స్ కోసం బయ్యర్లు బేరాలు మొదలు
పెట్టారు.
తాజాగా ఈసినిమా కర్ణాటక హక్కులు భారీ రేటుకు అమ్ముడైనట్లు
సమాచారం. మనకు అందిన సమాచారం ప్రకారం నాలుగున్నర కోట్లకు వెళ్లినట్లు
తెలుస్తోంది. బిఎన్ ఆర్ ఫిల్మ్ ఈ రైట్స్‌ని సొంతం చేసుకుంది. గతంలో
వీరే ‘దూకుడు ’ ని కర్ణాటకలో విడుదల చేసారు. ఆ సినిమా మంచి వసూళ్ళు
సాధించడంతో మళ్లీ వారే భరీ రేటుకు సొంతం చేసుకున్నారు. ‘దూకుడు ’
చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అయితే సినీ విశ్లేషకులు మాత్రం కర్ణాటక రైట్స్ అంతకు అమ్ముడైతే తెలుగు
రైట్స్ భారీ రేటుకు అమ్ముడవ్వడం ఖాయం అంటున్నారు.
No comments:
Post a Comment