Wednesday, 3 April 2013

Rey Climax Song Shot With 1.50 Crores

Rey climax song

మెగాస్ట్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘రేయ్‌’. ‘షౌట్‌ ఫర్‌ సక్సెస్‌’ అనేది ఉపశీర్షిక. సయామీ ఖేర్‌ కథానాయిక. మరో కీలకపాత్రలో శ్రద్ధాదాస్‌ నటిస్తున్నారు. బొమ్మరిల్లు వారి పతాకంపై యలమంచిలి గీత సమర్పణలో వైవిఎస్‌ చౌదరి స్వీయ నిర్మాణదర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం కోసం కోటిన్నర ఖర్చుతో 8నిమిషాల క్లైమాక్స్‌ సాంగ్‌ని తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ ఏడెకరాల్లో వేసిన భారీసెట్‌లో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ప్రేమ్క్ష్రిత్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. వైవీయస్‌ మాట్లాడుతూ-‘‘ఈ సినిమా క్లైమాక్స్‌లో ఎలాంటి భారీ పోరాటాలు ఉండవు. ఆ స్థానే భావోద్వేగాలు నిండిన భారీ పాటను డిజైన్‌ చేశాం. అమెరికాలోని టాప్‌ పాప్‌స్టార్స్‌ మధ్య పోటీ నేపథ్యంలో పాట వస్తుంది. ఇందులో హీరో బ్యాచ్‌ ఎలా విజయం సాధిం చిందన్నది ఆసక్తికరం. 2007లో అమెరికా లాస్‌ వెగాస్‌లో నేను చూసిన ఓ లైవ్‌షో నుంచి ఇన్‌సై్పర్‌ అయి ఈ పాటను డిజైన్‌ చేశాను ’’ లిపారు.

No comments:

Post a Comment