Wednesday, 10 April 2013

Dhanush In Shankar Direction


ఇప్పటి వరకు సూపర్ స్టార్ రజినీ కాంత్ తో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేసి రికార్డులు స్రుష్టించిన దర్శకుడు శంకర్  త్వరలో రజినీకాంత్ అల్లుడు ధనుష్ తో ఓ చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా శకంర్ ఓ ప్రాజెక్టు అయిన తరువాత మరో దాన్ని మొదలు పెడతాడు. కానీ ఈసారి ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. 

ప్రస్తుతం ఈయన తమిళ స్టార్ అయిన విక్రమ్ హీరోగా 100 కోట్ల బడ్జెట్ తో ‘ఐ ’ అనే సినిమా తీస్తున్నాడు. దాన్నే తెలుగులో ‘మనోహరుడు ’ పేరుతో అనువదిస్తున్నారు. శంకర్ ధనుష్ తో తీసే సినిమాకు సంబంధించి కథా చర్చలు పూర్తయ్యాయని, ఏజీఎస్ సంస్థ ఈ సినిమాని నిర్మించబోతుందని సమాచారం. ఈ సినిమాకు సంభందించిన మిగతా వివరాలు కూడా త్వరలో వెల్లడిస్తారని అంటున్నారు. అయితే కొందరు మాత్రం రజినీకాంత్ రికమెండ్ చేస్తేనే ధనుష్ తో సినిమా చేయడానికి శంకర్ ఒప్పుకున్నాడని కూడా అనుకుంటున్నారు.

Pawan Kalyan Sampath Nandi Mass Movie



త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ మాంచి మాస్ మసాల చిత్రంతో రాబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన ‘రచ్చ ’ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారనే విషయం తెలిసిందే. అప్పట్లో సంపత్ నంది స్టోరీకి కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని పవన్ రమ్మన్నాడు. ఇన్ని రోజులు దీని పై పూర్తి వర్క్ చేసిన సంపత్ నంది పూర్తి మాస్ మసాలా స్టోరిగా మలిచి పవన్ కి వినిపించాడట. 

ఈ స్టోరీ విన్న పవన్ ఓకే చేశాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతుందట. ఈ సినిమాని మే రెండో వారం నుండే సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మించబోతున్న విషయం తెలిసిందే. . త్వరలోనే ఈ చిత్రానికి సంభందించి ప్రకటన వస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో పవన్ ఫ్యాన్స్ కి కావాల్సిన డైలాగులు, మాస్ సీన్లు ఉంటాయని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ మాస్ హీరోగా అలరించడం ఖాయం అంటున్నారు.

Jr NTR And Kareena Kapoor To Act Together



యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ ఇద్దరు కలిసి నటించబోతున్నారా ? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. వీరు నటించబోయేది వాస్తమే కానీ... సినిమాలో కాదు... ఓ బంగారం షాపు యాడ్ లో. ఇప్పటికే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యాడ్ లో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ యాడ్ లోనే కరీనా కపూర్, ఎన్టీఆర్ కలిసి నటించబోతున్నాడు. త్వరలో దీనికి సంబంధించిన ఫోటో షూట్ కూడా జరపనున్నారు. యాడ్ చిత్రీకరించి టీవి లకు ఇస్తారు. చాలా పెద్ద బడ్జెట్ తో ఈ యాడ్ నిర్మాణం కానుందని సమాచారం.  

ఆ విషయం ప్రక్కన పెడితే ఎన్టీఆర్ ఇప్పుడు తాను నటించిన ‘బాద్ షా ’ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. చాలా కాలం తరువాత వచ్చిన ఈ సినిమా విజయ ఆనంద క్షణాలను కొన్ని చెప్పాడు. నా కెరీర్‌లో గొప్ప విజయాన్ని నాకు అందించిన దర్శకుడు, నా అన్న.. శ్రీను వైట్లకు కృతజ్ఞతలు. కేవలం ఆయన్ని నమ్మే యేడాదిపాటు ఈ సినిమాతో ప్రయాణం చేశా. ఈ సినిమా హిట్టవ్వకపోతే.. పరిశ్రమలో ఉండలేనేమో అనే ఆలోచనలు ఎంత మాత్రం లేవు. నన్ను కన్న నా తల్లిదండ్రులు, నా దైవం ఎన్టీఆర్‌ అండదండలు నాకెప్పటికీ ఉంటాయి. అభిమానుల ప్రోత్సాహం కూడా మర్చిపోలేనుఅన్నారు.

Nayanthara Shocking Demands



ప్రేమా దోమా అంటూ పలువురు హీరోలతో తిరిగి, అవన్నీ బెడిసికొట్టిన తరువాత మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నయనతార ఇప్పుడు ఫుల్ బిజీ హీరోయిన్. ఈమెకు ఎన్ని రిమార్కులు ఉన్నా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇటు హీరోయిన్ గా బిజీగా ఉంటూనే మరో ప్రక్క ఐటెం సాంగులు కూడా చేయడానికి రెఢీ అయింది. తాజాగా ఈ అమ్మడును ఐటెంసాంగులో నటించమని అడిగారట నిర్మాతలు. ఐటెం సాంగు చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది గానీ పారితోషికం మాత్రం నయనతార భారీగా డిమాండ్ చేసిందట. ఈ అమ్మడు ఐటెం సాంగు కోసం అడిగిన మొత్తం ఎంతో తెలుసా అక్షరాల యాభై లక్షలు. దీనికి ఒక్కరూపాయి కూడా తగ్గినా ఐటెం సాంగు చేయనని తెగేసి చెప్పడంతో సదరు నిర్మాతలు బెంబేలెత్తి పోయారట. అంతే కాకుండా కొన్ని కండీషన్లు కూడా పెట్టి వాటికి ఒప్పుకుంటేనే చేస్తానని చెప్పడంతో సదరు నిర్మాతలు వెనెక్కి వెళ్ళిపోయారట. నయన డిమాండ్ ఉన్నప్పుడే పైసలు రాబట్టుకోవాలనే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తుందని సినీ జనాలు అనుకుంటున్నారు.

Zanjeer Movie Faces Another Hurdle



 
భారీ వ్యయంతో తీసే సినిమాల మీద ఎప్పుడూ ఏదో ఒక అభ్యంతరం చెప్పే వాళ్ళు ఉంటూనేవుంటారు.  అలాగని వాళ్ళ హక్కులను వాళ్ళు వినియోగించుకోగూడదని కాదు కానీ, చిత్ర నిర్మాణమంతా పూర్తై తీరా విడుదలకు సిద్ధం చేసుకుంటున్న తరుణంలో అభ్యంతరాలు తెలియజేయటమంటే ఒత్తిడిలో పెట్టి రావలసినదానికంటే ఎక్కువ ఆశించటానికి చేసే ప్రయత్నమనే చెప్పుకోవాలి.  అయితే దురదృష్టవశాత్తూ న్యాయస్థానంలో అభ్యంతరాలు తెలియజేయటానికి ఒక కాలనిర్ణయమంటూ ఏమీ లేదు.  అందువలన సరైన సమయాన్ని చూసి అంటే కీలెరిగి వాత పెట్టాలని చూసేవాళ్ళే చాలామంది ఉంటారు.  

తెలుగు, హిందీ భాషల్లో రామ్ చరణ్ తేజ హీరోగా నిర్మించిన జంజీర్ సినిమా ఎప్పటికప్పుడు కొత్త వివాదాల్లో చిక్కుకుంటోంది.  నిర్మాణ హక్కులున్న సోదరులు, కథా రచయితలు శాంతించారనుకుంటే కొత్తగా, పాత సినిమా స్క్రిప్ట్ రైటర్లు కూడా కొత్త జంజీర్ సినిమా మీద అభ్యంతరాలు తెల్పుతూ కోర్టు గడప ఎక్కారు. 
ఏదోవిధంగా రాజీ అయితే కుదురుతుందిలే కానీ, ఇలా అవాంతరాల మీద అవాంతరాలు వచ్చి జంజీర్ సంకెళ్ళు తెగకుండా కొనసాగుతుండటం చిత్ర నిర్మాతలు, దర్శకుడు, కళాకారులకు ఎలాగూ వేదన కలిగించే విషయమే కానీ, అంతకంటే ఎక్కువ బాధ పడుతున్నారు మెగా అభిమానులు.  తమ అభిమాన హీరోని హిందీ పరదా మీద చూద్దామని ఉవ్విళ్ళూరుతున్న రామ్ చరణ్ అభిమానుల ఉత్సాహం మీద నీళ్ళు చల్లినట్టుగా అభ్యంతరాల వెల్లువ రావటం వాళ్ళందరికీ నిరాశను కలిగిస్తోంది.  

జయ భాదురి (బచ్చన్), అమితాబ్ బచ్చన్ నాయికా నాయకులుగా, పఠాన్ పాత్రలో ప్రాణ్ సహాయ నటుడిగా హిందీ సినీ క్షేత్రంలో విజయం సాధించిన జంజీర్ సినిమా తాజాగా రామ్ చరణ్, ప్రియాంక చోప్డా హీరో హీరోయిన్లుగా హిందీలో అదే పేరుతో తెలుగులో తుఫాన్ పేరుతో నిర్మాణం పూర్తి చేసుకుంది.  పఠాన్ పాత్రను హిందీలో సంజయ్ దత్, తెలుగులో శ్రీహరి పోషించారు.  ఆ కాలంలో లేకపోయినా ఇప్పటి రోజుల్లో భారీ చిత్రంలో ఐటమ్ సాంగ్ తప్పనిసరి కాబట్టి కవితా కౌషిక్ ఆ పనిని పూర్తి చేసింది.  ప్రకాశ్ రాజ్ ఇందులో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. 

Hindu Gods Bikini Photos In Facebook


 
ప్రపంచ దేశాల్లో రెండు స్థానం సంపాదించుకున్న  భారతదేశానికి  విచిత్రమైన అవమానాలు జరుగుతున్నాయి. ఇండియా అంటే  అన్ని దేశాల వారికి   చులకన భావం ఏర్పాడింది. అందుకు ప్రతి ఒక్కరు మన హిందువు దేవుళ్లను  విచిత్రంగా చిత్రకరిస్తున్నారు.  మన దేశ దేవతలు .. వారికి ఆట వస్తువులుగా మార్చుకుంటున్నారు.  ఇప్పటి వరకు  విదేశాల్లో జరిగిన అవమానమే మనం  చూశాం. కానీ మన దేశంలోనే  హిందుదేవుళ్లలకు  అవమానం జరుగుతుంది.  హిందువుల మనోభావాలను  దెబ్బతీయ్యటానికే ఇలాంటి పనులు చేస్తున్నారు. 

విగ్రహారాధన పట్ల చిన్న చూపుతో పాశ్చాత్య దుస్తుల కంపెనీలు, గృహోపకరణల తయారీ సంస్థలు హిందూ దేవతలను మహిళల లోదుస్తులపై, టాయ్‌లెట్‌లపై ముద్రించి అమ్ముతూ వివాదాలు సృష్టించిన విషయం ఎప్పటినుంచో జరుగుతోంది. కాని ఉత్తరప్రదేశ్‌ లోని మీరట్‌ పట్టణంలో మహిళలు ధరించే బికినీలపై హిందూదేవతల చిత్రాలను ముద్రించారన్న వార్త వెలుగుచూడటంతో తీవ్రంగా కలకలం చెలరేగింది. ఫేస్‌బుక్‌లో ఈ బికినీ దేవతలను ప్రదర్శనకు పెట్టడంతో పట్టణంలోని హిందూ బృందం ఆ దారిన పోతున్న ముస్లిం వివాహ ప్రదర్శనపై దాడి చేశారు. మీరట్‌లో మొబైల్‌ షాపు నడుపుతున్న రాకీ హిందూ దేవతలను అసభ్యంగా ప్రదర్శిస్తున్న గురుకల్‌ కలౌటి బాబా ఫేస్‌బుక్‌ పేజీని చూసి పోలీసులకు సమాచారమిచ్చాడు. కాని పోలీసులు ఈ ఘటనపై నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంతో రాకీ తను సభ్యుడిగా ఉన్న వ్యాపారుల మండలికి నివేదించాడు.

హిందువుల మనోభావాలను గాయపరుస్తున్న ఈ బికినీ దేవతల చిత్రాలపై ఆగ్రహించిన వ్యాపారులు పోలీసు స్టేషన్‌ ముందు ధర్నాకు దిగడంతో పోలీసులు దిగివచ్చి సంబంధిత ఫేస్‌బుక్‌ నిర్వాహకులపై కఠిన చర్యకు హామీనిచ్చారు.  ఇలాంటి చర్యలను  ఎందుకు అట్టుకోలేకపోతున్నాం. హిందు దేవతలు అంటే  అంత చులకన ఎందుకు?   ఒక మతం వారిని ఇతర మతల వారు కించపరచకూడదని  పవిత్ర గ్రంధలే చెబుతున్నాయి. అయితే ఎవరి మతం వారికి గొప్ప, ఎవరి దేవుడు వారికి గొప్ప.  అంతేగానీ .. ఒక మతం వారి దేవతలను ఇలా నీచంగా చూపిస్తే,  వారి మతానికి ఏం వస్తుంది? ఆలోచన గుణంలేని వ్యక్తి చేసే పొరపాట్లు వలన , రెండు మతల ప్రజలు శత్రువులుగా మారుతున్నారు. ఇలాంటి  నీచమైన పనులు చేయటం వలన కన్నతల్లికే అవమానం చేసినట్లు అవుతుంది. 

 ఒక మతం దేవతలు, మరో మతం వారికి కన్న తల్లితో సమానం.   అలాంటి కన్నతల్లికి ఇలాంటి అవమానం ఎవరైన చేస్తారా?  పది పైసల్ సంపాదన కోసం  హిందు దేవతలతో  ఆటలాడుకోవటం చాలా దారుణం. ఈ విషయాన్ని  ప్రతి ఒక్క హిందువు తీవ్రంగా ఖండించాలి.   అమ్మ... అని పిలిచే ప్రతి భారతీయుడు   ఈ విషయం పై ఫైట్ చెయ్యాలి. మన దేశం ప్రతిష్టను మనమే కాపాడుకోవాలి. అందుకు ప్రతిఒక్కరు  ముందుకు రావాలి.  ఇప్పుడు   ఈ విషయాన్ని ఇలా వదిలేస్తే ... రాబోయే తరాలవారు .. హిందు దేవతలు  అంటే ఎవరు?  అనే స్థాయికి చేరుతుంది.  అందుకే ఇతర మతలను చులకనగా చూసే ప్రతి ఒక్కరికి  గుణపాఠం చెప్పాలి.  పాలు తాగే వయసులోనే పరిస్థితిని చక్కదిద్దాలి. లేకపోతే లోపాలు పెరిగిపోయి,   లోక వినాశనం జరుగుతుంది.

Manchu Manoj Hot Romance Fourgirls In Potugadu


    ఇప్పటికే తెలుగుతెరపై ఇద్దరమ్మాయిలతో రొమాన్స్ చేస్తున్నా జులాయి ఎవరు అందరి తెలుసు. ఇప్పుడు ఆ కుర్రకారు  ఆ జులాయి కోసం ఎదురుచూస్తున్నారు.  టాలీవుడ్ జులాయి మీద అంత మోజు పెంచుకున్న భామలు చాలా మంది ఉన్నారు.  అలాంటి జులాయికే  షాకిచ్చిస్తున్నాడు మంచువారి అబ్బాయి  మనోజ్.  టాలీవుడ్ తెరపై  కొన్ని ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్న  నటుడు మంచు మనోజ్  ఈసారి సరికొత్తగా ప్రయోగం చేయబోతున్నాడు.  మనోజ్ ప్రయోగం  అన్న వెంటనే  డాక్టర్ మోహన్ బాబుకు గుండెల్లో  ఉన్న స్పీడో మీటర్  వేగం పెంచింది. అంటే గతంలో  కొడుకు ప్రయోగాలతో.. ఫైసల్ పొగొట్టుకున్న నిర్మాతగా  టాలీవుడ్ లో పేరుతెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే  ఈ ఏకంగా  నలుగురమ్మాయిలతో కలిసి రొమాన్స్ చెయ్యాటానికి  సిద్దమైనట్లు టాలీవుడ్ వర్గాలు  చెబుతున్నాయి. అయితే మనోజ్ సరసన సాక్షి చౌదరి,  సిమ్రాన్ ముండి, నటాలియా కౌర్ , పాటు మరో హీరోయిన్ కూడా  ఉన్నట్లు సమాచారం. అయితే  అటు పొగడ్తకి, ఇటు తెగడ్తకి  రెండింటికి సరిపోయే పదం ‘పోటుగాడు’ అనే పేరుతో మనోజ్ రోమాన్స్ చేయటానికి  సిద్దంగా ఉన్నారు.   అయితే  ఈ పోటుగాడు  సాక్షి చౌదరిపై తో కలిసి  50 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి   బీజాపూర్ లో హాట్ రొమాన్స్ చేసినట్లు  టాలీవుడ్ సమాచారం.  అంటే ఒక్క పాట కోసం 50 లక్షలు ఖర్చుపెట్టి షూటింగ్ చెయ్యటం పై  మంచు మోహన్ బాబు ఆందోళన చెందుతున్నట్లు  ఫిలింనగర్ వాసులు చెప్పుకుంటున్నారు.