Wednesday, 10 April 2013

Hindu Gods Bikini Photos In Facebook


 
ప్రపంచ దేశాల్లో రెండు స్థానం సంపాదించుకున్న  భారతదేశానికి  విచిత్రమైన అవమానాలు జరుగుతున్నాయి. ఇండియా అంటే  అన్ని దేశాల వారికి   చులకన భావం ఏర్పాడింది. అందుకు ప్రతి ఒక్కరు మన హిందువు దేవుళ్లను  విచిత్రంగా చిత్రకరిస్తున్నారు.  మన దేశ దేవతలు .. వారికి ఆట వస్తువులుగా మార్చుకుంటున్నారు.  ఇప్పటి వరకు  విదేశాల్లో జరిగిన అవమానమే మనం  చూశాం. కానీ మన దేశంలోనే  హిందుదేవుళ్లలకు  అవమానం జరుగుతుంది.  హిందువుల మనోభావాలను  దెబ్బతీయ్యటానికే ఇలాంటి పనులు చేస్తున్నారు. 

విగ్రహారాధన పట్ల చిన్న చూపుతో పాశ్చాత్య దుస్తుల కంపెనీలు, గృహోపకరణల తయారీ సంస్థలు హిందూ దేవతలను మహిళల లోదుస్తులపై, టాయ్‌లెట్‌లపై ముద్రించి అమ్ముతూ వివాదాలు సృష్టించిన విషయం ఎప్పటినుంచో జరుగుతోంది. కాని ఉత్తరప్రదేశ్‌ లోని మీరట్‌ పట్టణంలో మహిళలు ధరించే బికినీలపై హిందూదేవతల చిత్రాలను ముద్రించారన్న వార్త వెలుగుచూడటంతో తీవ్రంగా కలకలం చెలరేగింది. ఫేస్‌బుక్‌లో ఈ బికినీ దేవతలను ప్రదర్శనకు పెట్టడంతో పట్టణంలోని హిందూ బృందం ఆ దారిన పోతున్న ముస్లిం వివాహ ప్రదర్శనపై దాడి చేశారు. మీరట్‌లో మొబైల్‌ షాపు నడుపుతున్న రాకీ హిందూ దేవతలను అసభ్యంగా ప్రదర్శిస్తున్న గురుకల్‌ కలౌటి బాబా ఫేస్‌బుక్‌ పేజీని చూసి పోలీసులకు సమాచారమిచ్చాడు. కాని పోలీసులు ఈ ఘటనపై నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంతో రాకీ తను సభ్యుడిగా ఉన్న వ్యాపారుల మండలికి నివేదించాడు.

హిందువుల మనోభావాలను గాయపరుస్తున్న ఈ బికినీ దేవతల చిత్రాలపై ఆగ్రహించిన వ్యాపారులు పోలీసు స్టేషన్‌ ముందు ధర్నాకు దిగడంతో పోలీసులు దిగివచ్చి సంబంధిత ఫేస్‌బుక్‌ నిర్వాహకులపై కఠిన చర్యకు హామీనిచ్చారు.  ఇలాంటి చర్యలను  ఎందుకు అట్టుకోలేకపోతున్నాం. హిందు దేవతలు అంటే  అంత చులకన ఎందుకు?   ఒక మతం వారిని ఇతర మతల వారు కించపరచకూడదని  పవిత్ర గ్రంధలే చెబుతున్నాయి. అయితే ఎవరి మతం వారికి గొప్ప, ఎవరి దేవుడు వారికి గొప్ప.  అంతేగానీ .. ఒక మతం వారి దేవతలను ఇలా నీచంగా చూపిస్తే,  వారి మతానికి ఏం వస్తుంది? ఆలోచన గుణంలేని వ్యక్తి చేసే పొరపాట్లు వలన , రెండు మతల ప్రజలు శత్రువులుగా మారుతున్నారు. ఇలాంటి  నీచమైన పనులు చేయటం వలన కన్నతల్లికే అవమానం చేసినట్లు అవుతుంది. 

 ఒక మతం దేవతలు, మరో మతం వారికి కన్న తల్లితో సమానం.   అలాంటి కన్నతల్లికి ఇలాంటి అవమానం ఎవరైన చేస్తారా?  పది పైసల్ సంపాదన కోసం  హిందు దేవతలతో  ఆటలాడుకోవటం చాలా దారుణం. ఈ విషయాన్ని  ప్రతి ఒక్క హిందువు తీవ్రంగా ఖండించాలి.   అమ్మ... అని పిలిచే ప్రతి భారతీయుడు   ఈ విషయం పై ఫైట్ చెయ్యాలి. మన దేశం ప్రతిష్టను మనమే కాపాడుకోవాలి. అందుకు ప్రతిఒక్కరు  ముందుకు రావాలి.  ఇప్పుడు   ఈ విషయాన్ని ఇలా వదిలేస్తే ... రాబోయే తరాలవారు .. హిందు దేవతలు  అంటే ఎవరు?  అనే స్థాయికి చేరుతుంది.  అందుకే ఇతర మతలను చులకనగా చూసే ప్రతి ఒక్కరికి  గుణపాఠం చెప్పాలి.  పాలు తాగే వయసులోనే పరిస్థితిని చక్కదిద్దాలి. లేకపోతే లోపాలు పెరిగిపోయి,   లోక వినాశనం జరుగుతుంది.

No comments:

Post a Comment