Wednesday, 10 April 2013

Zanjeer Movie Faces Another Hurdle



 
భారీ వ్యయంతో తీసే సినిమాల మీద ఎప్పుడూ ఏదో ఒక అభ్యంతరం చెప్పే వాళ్ళు ఉంటూనేవుంటారు.  అలాగని వాళ్ళ హక్కులను వాళ్ళు వినియోగించుకోగూడదని కాదు కానీ, చిత్ర నిర్మాణమంతా పూర్తై తీరా విడుదలకు సిద్ధం చేసుకుంటున్న తరుణంలో అభ్యంతరాలు తెలియజేయటమంటే ఒత్తిడిలో పెట్టి రావలసినదానికంటే ఎక్కువ ఆశించటానికి చేసే ప్రయత్నమనే చెప్పుకోవాలి.  అయితే దురదృష్టవశాత్తూ న్యాయస్థానంలో అభ్యంతరాలు తెలియజేయటానికి ఒక కాలనిర్ణయమంటూ ఏమీ లేదు.  అందువలన సరైన సమయాన్ని చూసి అంటే కీలెరిగి వాత పెట్టాలని చూసేవాళ్ళే చాలామంది ఉంటారు.  

తెలుగు, హిందీ భాషల్లో రామ్ చరణ్ తేజ హీరోగా నిర్మించిన జంజీర్ సినిమా ఎప్పటికప్పుడు కొత్త వివాదాల్లో చిక్కుకుంటోంది.  నిర్మాణ హక్కులున్న సోదరులు, కథా రచయితలు శాంతించారనుకుంటే కొత్తగా, పాత సినిమా స్క్రిప్ట్ రైటర్లు కూడా కొత్త జంజీర్ సినిమా మీద అభ్యంతరాలు తెల్పుతూ కోర్టు గడప ఎక్కారు. 
ఏదోవిధంగా రాజీ అయితే కుదురుతుందిలే కానీ, ఇలా అవాంతరాల మీద అవాంతరాలు వచ్చి జంజీర్ సంకెళ్ళు తెగకుండా కొనసాగుతుండటం చిత్ర నిర్మాతలు, దర్శకుడు, కళాకారులకు ఎలాగూ వేదన కలిగించే విషయమే కానీ, అంతకంటే ఎక్కువ బాధ పడుతున్నారు మెగా అభిమానులు.  తమ అభిమాన హీరోని హిందీ పరదా మీద చూద్దామని ఉవ్విళ్ళూరుతున్న రామ్ చరణ్ అభిమానుల ఉత్సాహం మీద నీళ్ళు చల్లినట్టుగా అభ్యంతరాల వెల్లువ రావటం వాళ్ళందరికీ నిరాశను కలిగిస్తోంది.  

జయ భాదురి (బచ్చన్), అమితాబ్ బచ్చన్ నాయికా నాయకులుగా, పఠాన్ పాత్రలో ప్రాణ్ సహాయ నటుడిగా హిందీ సినీ క్షేత్రంలో విజయం సాధించిన జంజీర్ సినిమా తాజాగా రామ్ చరణ్, ప్రియాంక చోప్డా హీరో హీరోయిన్లుగా హిందీలో అదే పేరుతో తెలుగులో తుఫాన్ పేరుతో నిర్మాణం పూర్తి చేసుకుంది.  పఠాన్ పాత్రను హిందీలో సంజయ్ దత్, తెలుగులో శ్రీహరి పోషించారు.  ఆ కాలంలో లేకపోయినా ఇప్పటి రోజుల్లో భారీ చిత్రంలో ఐటమ్ సాంగ్ తప్పనిసరి కాబట్టి కవితా కౌషిక్ ఆ పనిని పూర్తి చేసింది.  ప్రకాశ్ రాజ్ ఇందులో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. 

No comments:

Post a Comment