అభిమానం హద్దులు దాటితే? ఏం చెయ్యాలి? అభిమానం ఉండాలి.. కానీ అయిన వారికి
అన్యాయం చెయకూడదు. ఏ తల్లిదండ్రులకు పుత్రశోకం లేకుండా చూడాలి? అభిమాన
హీరోల కోసం వెళ్లి.. ఆపదలో చిక్కుకొని.. అనంత లోకాలకు వెళ్లితే..
కనిపెంచిన అమ్మనాన్నల పరిస్థితి ఏమిటి? ఓ అభిమాని ఒక్కసారి నిశితంగా
ఆలోచించు? అభిమానం ఉండాలి? తల్లిదండ్రుల తరువాతనే అభిమానం అనేది
తెలుసుకోవాలి. రీసెంట్ గా జరిగిన ఒక ఆడియో ఫంక్షన్ తొక్కిసలాటలో ఒక
అభిమాని మరణించిన విషయం తెలిసిందే. కళ్లముందు కనిపించే కొడుకు..
కాలకార్భంలో కలిసిపోతే.. ఆ తల్లి పడే బాధ అంత ఇంత కాదు. ఆ కుటుంబానికి
ఎన్నికోట్లు ఇచ్చిన .. ఆ తల్లిదండ్రుల బుణం తీర్చుకోలేం. ఆ తల్లి కొడుకు
ముందు ఎన్నికోట్లైన దిగతూడుపే. అభిమానం అనేది గుండెళ్లో ఉండాలి కానీ, అది
కన్నవారికి కన్నీరుగా మిగిలిపోకూడదు. ఏరంగంలో ప్రముఖుడైన వారిని
అభిమానించడం మామూలే. అందునా సినిమా హీరో అంటే కాస్త హడావిడి ఎక్కువగా
ఉంటుంది. కానీ ఆ అభిమానం ఎలా ఉండాలి?
దాన్ని హీరోలు ఏ కోణంలో చూడాలి?
అనేది
గ్రహించాలి. ఒక హీరో రోడ్డుమీద పోతుంటే... దారినపోయేవారి అతన్ని
చూడాలనుకోవడం వారిని కంట్రోల్ చేయడం ఒక ఎత్తు. కానీ భారీ ఫంక్షన్ ఏర్పాటు
చేసి అక్కడ నియంత్రించడం మరోఎత్తు. సినిమా రిలీజ్‌రోజు థియేటర్లలో
అభిమానులు తమ వీరత్వాన్ని చూపిస్తుంటారు. టిక్కెట్ బుకింగ్ కౌంటర్లలో
ఒకరితర్వాత ఒకరు తీసుకోవాలనే నిబంధన ఉంటుంది. అయినా... మొదటిరోజు మొదటి
ఆటచూడలేక పోతామోనన్న ఆదుర్దా,
తొందరపాటు
తనంలో సింగిల్‌లైన్ ఉన్న మార్గంలో పైకి ఎక్కి జనాలపైనుంచి వెళ్ళి
తోపులాటలతో ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలు అగ్రహీరోల చిత్రాల్లో చాలా
జరిగాయి. ఇలా జరగడానికి కారకులు ఎవరు?
థియేటర్ల నిర్వాహకులదా?
అభిమానంతో తొందరపడిన వారిదా?
రెండింటిని వేరుగా చూడలేం.
ఆమధ్య చిత్తురు జిల్లాలో జరిగిన సంఘటన ఓ అగ్రహీరో సినిమా విడుదలనాడే తెల్లారిజామున థియేటర్ లైన్‌లో నుంచున్న అభిమాని షార్క్‌సర్క్యూట్‌వల్ల చనిపోయిన ఘటన జరిగింది.
సినిమా ఫంక్షన్లు జరిగేటప్పుడు అభిమానులు నియంత్రించడం నిర్వాహకులకు, పోలీసు యంత్రాంగానికి చాలా కష్టంతోకూడిన పనే. అందుకే నిర్వాహకులు ప్రణాళికబద్ధంగా ఫంక్షన్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఇటీవలే మహేష్, వెంకటేస్ నటించిన 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్లు' ఆడియో వేడుక నానక్‌రామ్‌గూడాలో జరిగింది. అప్పుడే చాలామంది ఇబ్బందిపడ్డా.. ఎటువంటి నష్టం జరగకపోవడంతో... విశాలమైన, ఆకర్షణీయమైన స్టేజీ ఇండిస్టీలో పలువురు హీరోలను ఆకర్షించింది. ఆ వెంటనే ప్రభాస్ నటించిన 'మిర్చి' వేడుక
జరిగింది. ఆనాడు కృష్ణంరాజు అభిమానులకు చేదు అనుభవంకూడా ఎదురైంది. ఓ దశలో
అభిమానులు చేసిన అల్లరికి కుర్చీలు విరిగిపోయాయి. ఇలా నా అభిమానులు చేయరని
కూడా కృష్ణంరాజు స్టేట్‌మెంట్ ఇవ్వాల్సివచ్చింది. అటువంటి అనుభవం జరిగిన
తర్వాత మళ్ళీ అక్కడే 'బాద్‌షా' వేడుక
జరపాలనుకోవడం ఇండిస్టీ పెద్దలను ఆశ్చర్యపర్చింది. ఇది నిర్వాహకుల లోపంగా
వారు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి చోట్లకు అభిమానులు రావడం, గోల చేయడం, ఎవ్వరి మాటా వినకపోవడం అనేది మామూలే. అయితే అలాంటి సమయంలో నిర్వాహకులు, పోలీసు
యంత్రాంగం ఎం చేయాలనేది ప్రశ్న తలెత్తుతుంది. అగ్రహీరోకు అభిమానులు
ఎక్కువైతే విశాలమైన ప్రాంగణంలో జరపాలి. నానక్‌రామ్‌గూడాలో ఆ వెసులువాటు
లేదు. కేవలం మెయిన్‌రోడ్డు నుంచి 20ఫీట్స్ ఉన్న రోడ్డుగుండా లోపలికి
ప్రవేశించాలి. అక్కడ సరైన పార్కింగ్ సదుపాయంకూడా లేదు. ఆ రోడ్డుగుండానే
రింగ్‌రోడ్డుకు మార్గం ఉండడంతో ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది. మామూలు
రోజుల్లోనే సాయంత్రం 6 గంటలైయితే విపరీతమై ట్రాఫిక్ జామ్ ఉండే ప్రాంతంలో
ఏకంగా వేలాదిమంది తరలివచ్చే సినిమా ఫంక్షన్స్‌కు ఎంచుకోవడం ఆశ్చర్యం
కల్గించింది. అసలు ఫంక్షన్స్ ఎక్కడ జరాగాలి. అభిమానులు ఒకరోజు ముందుగానే
వివిధ ప్రాంతాలనుంచి తరలివస్తారు. వారికి కనీస సౌకర్యాలుకూడా ఉండవు. అయినా
కష్టపడి వచ్చిన వారిని చూడటం, ఆనందించటం మామూలే. అలాంటప్పుడు వారికి కనీససౌకర్యాలు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో ఫంక్షన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అసలు ఈ అభిమానుల సందడి ఇప్పటిది కాదు. లోగడ ఎన్.టి.ఆర్,
ఎ.ఎన్.ఆర్. చిత్రాల వేడుకల్లోనూ ఇటువంటి జరుగుతున్నవే. కృష్ణ నటించిన '
సింహాసనం'
చిత్రం
ఫంక్షన్ అప్పట్లో మద్రాసులో జరిగింది. పోలీసు కమిషనర్ నుంచి కృష్ణ
పర్మిషన్ తీసుకున్నారు. ఆంధ్రప్రవేశ్‌నుంచి మద్రాసుకు రావడం తక్కువ అని
ఆనాడు ఆయన భావించారట. కానీ ఫంక్షన్‌నాటికి వేడుకజరిగే ప్రాంతానికి 12
కి.మీ. దూరం వరకు ట్రాఫిక్ జామ్ అయింది. అందులో నటించిన జయసుధ,
మందాకినీ
వంటివారు రావడానిక్కూడా వీలులేకపోయింది. ఇందుకు ఎవర్ని నిందించాలి.
ఇలాంటిదే ఒకప్పుడు చిరంజీవి వేడుక గుంటూరులో జరిగితే బైపాస్‌రోడ్డంతా
ఉక్కిరిబిక్కిరయింది.బాద్‌షా చిత్ర వేడుకలో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో పోలీసులు లాఠీకి పనిచెప్పారు.
ఎవరికివారు చెల్లాచెదురై పోయారు. ఒక అభిమాని చనిపోతే అక్కడే ఉన్న
ప్రముఖుల్ని ప్రశ్నించడంకానీ,
ఆవేశంతో
తిరుగుబాటు చేయడం కానీ చేయలేదు. ఇలాంటివి జరిగితే.. నిర్వాహకులు భయపడి
ఇటువంటి ఫంక్షన్స్ పెట్టకపోవచ్చు. పెట్టినా సరైన చర్యలు తీసుకోవచ్చు. అభిమానులుకూడా మేల్కొనాలి. ఇప్పుడు అనేక కార్యక్రమాల్ని మీడియా,
ఇంటిముందుకు
తెస్తోంది. క్రికెట్‌మ్యాచ్ వస్తే దాన్ని దగ్గరగా చూడలేనివారికి లైవ్
క్రికెట్ అవకాశం వుంది. రోడ్లపై ఎక్కడ ఏ షాపులో చూసినా అభిమానులు
పనులుమానుకుని మరీ చూస్తుంటారు. అలాంటిది హీరోల ఫంక్షన్లు జరిగే సమయంలో
వాటిని నేరుగా ప్రసారం చేసే ఛానళ్లు ఉన్నాయి. ఇంటి దగ్గరే హాయిగా కూర్చొని
తిలకించవచ్చు. ఉన్న వసతిని ఉపయోగించుకుండా ఎక్కడికో వెళ్ళిచూడాల్సిన అవసరం
ఏంటని ఎవరికివారు ఆలోచించుకోవాలని సినీ పండితులు ప్రశ్నిస్తున్నారు.