మెగా అభిమానులకు హోలీ పండగ సందర్భంగా మరో బంఫర్ ఆఫర్ ప్రకటించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఎవడు ఫస్ట్ లుక్’ టీజర్ ను విడుదల చేయటం జరిగింది. రచ్చ, నాయక్ చిత్రాల తర్వాత రామ్‌చరణ్, శ్రుతిహాసన్, అమిజాక్సన్‌లు తారాగణంగా నటిస్తున్న చిత్రం 'ఎవడు'. మున్నా, బృందావనం
దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర
క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్, అమిజాక్సన్
తారాగణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాం. మార్చి 27న
రామ్‌చరణ్ పుట్టినరోజునాడు ఫస్ట్‌లుక్ టీజర్‌ను విడుదల చేయటం జరిగింది.
ఇప్పటికీ 90శాతం టాకీతోపాటు రెండు పాటలు పూర్తయ్యాయి.
ఓ
యాక్షన్ సీన్ బ్యాలెన్స్ ఉంది. వీటితో మొత్తం షూటింగ్ పూర్తవుతుంది.
దేవీశ్రీప్రసాద్ అందించిన ఆడియోను మే 9న విడుదల చేస్తాం. రామ్‌ప్రసాద్
అందించిన సినిమాటోగ్రఫీ హైలైట్‌గా ఉంటుంది. ఓ ప్రత్యేకమైన పాత్రలో అల్లు
అర్జున్, కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. పూర్తిగా ఓ వైవిధ్యమైన కథకి వినూత్నమైన కథనంతో అందరినీ ఆకట్టుకునేలా వంశీ తీర్చిదిద్దాడు.
ఇది టెక్నీషియన్స్ మూవీ. ఆద్యంతం థ్రిల్లింగ్‌గా ఉంటూనే అన్ని కమర్షియల్ హంగులతో సిద్ధమవుతున్న ఈ చిత్రాన్ని మెగా అభిమానులు, అన్ని వర్గాలప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది' అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ..'ఈరోజు ఫస్ట్‌లుక్ మాత్రమే విడుదలజేస్తున్నాం. మే 8న ఎవడు ఆడియోలో మెయిన్ లుక్‌ను విడుదల చేస్తాం. అభిమానుల్ని అలరించే చిత్రమవుతుంది' అని అన్నారు
No comments:
Post a Comment