Tuesday, 26 March 2013

Ntr New Film Ramaiya Vastavaiya

Movie news


ntr-harish shakar

యంగ్ టైగర్ ఎన్టీఆర్ శీను వైట్ల దర్శకత్వంలో నటించిన ‘బాద్ షా ’ షూటింగ్ పూర్తి చేసుకొని ఏప్రిల్ 5 న ప్రేక్షకుల మందుకు రావడానికి సిద్ధం అవుతుంది. ఈ సినిమా విడుదల కాకముందే ఎన్టీఆర్ ’రామయ్యా.. వస్తావయ్యా " అనే సినిమాలో నటించనున్నట్టు టాలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లో  ఇదే అంటూ టాలీవుడ్ లో వార్తలు షికారు చేస్తున్నాయి. ఇప్పటికే ‘గబ్బర్ సింగ్ ’ ఫేం హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాకు పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే ఆయన దర్శకత్వంలో నటించబోయే సినిమాకే ఈ టైటిల్ పెట్టనున్నారని అంటున్నారు. ఈ రొమాంటిక్ మూవీ చిత్రానికి సంబంధించిన కథను 'గబ్బర్ సింగ్' దర్శకుడు హరీష్ శంకర్ సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ చిత్రంలో హీరో కాలేజీ నేపథ్యంతో కూడిన పాత్రను పోషించనున్నాడట. ఎన్ని వార్తలు వినిపించినా అధికారిక ప్రకటన వచ్చే వరకు ఏది నిజమో చెప్పలేం.

No comments:

Post a Comment