మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాతికేళ్ళ
క్రితం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన ‘జంజీర్ ’ సినిమాను
రీమేక్ చేస్తూ, బాలీవుడ్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ
చిత్రాన్ని తెలుగు వెర్షన్లో కూడా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి
తెలుగు టైటిల్ గా ‘తుఫాన్ ’ అని నిర్ణయించారు.
తెలుగు వర్షన్ కి సంబంధించిన ఫస్ట్ లుక్
ని, వాల్ పేపర్స్ ని విడుదల చేశారు. తుఫాన్ ఫస్ట్ లుక్ పోస్టర్లు
అదిరిపోయే విధంగా ఉన్నాయి. పోలీస్ గెటప్ లో రామ్ చరణ్ పవర్ ఫుల్ లుక్‌తో
కేక పుట్టించే విధంగా ఉన్నాయి. ఇవి సినిమాపై అంచనాలు మరింత పెంచుతున్నాయి.
ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ తోపాటు
కథానాయిక ప్రియాంక చోప్రా, కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రకాష్ రాజ్,
శ్రీహరిలు కూడా ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. యాంగ్రీ యంగ్ మెన్ తరహాలో
రామ్ చరణ్ ఈ ఫస్ట్ లుక్కులో కనిపిస్తుండగా, ప్రియాంక బబ్లీ గాళ్ గా
అలరించింది. తుపాకీ పట్టుకొని ఓ వైపు శ్రీహరి, ప్రతినాయక చాయలతో మరోవైపు
ప్రకాష్ రాజ్ అలరించారు. ప్రకాష్ రాజ్ ఇందులో డిఫరెంట్ గెటప్ లో
కనిపించబోతున్నాడు.
చిత్రం ఆయిల్ మాఫియా నేపథ్యంలో సాగుతుందనే
విషయం ప్రస్పుటించేలా ఈ వాల్ పేపర్స్ ఉండటం గమనార్హం. వేసవిలో తుఫాన్
చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు నాట ఇప్పటికే హీరోగా సత్తా
చాటిన రామ్ చరణ్...బాలీవుడ్లో ఎంట్రీ కూడా అదరగొడతాడనే నమ్మకంతో ఉన్నారు
అభిమానులు.
No comments:
Post a Comment