‘ఝమ్మంది నాధం ’ సినిమాలో మంచు మనోజ్ సరసన
నటించి, ఆ తరువాత నుండి మంచు ఫ్యామిలీకే అంకితం అయిన తెల్లపిల్ల తాప్సీ
నిండా మునిగి గోదావరిలో కొట్టుకుపోతుంది. అదేంటి తాప్సీ గోదావరిలో
కొట్టుకుపోవడం ఏంటని అనుకుంటున్నారా ? ఇటీవల మంచు లక్ష్మి దర్శకత్వం
వహించిన గుండెల్లో గోదావరి సినిమాలో తాప్సీ నటించిన విషయం తెలిసిందే. ఈ
సినిమాలో తాప్సీ కొంత పెట్టబడి పెట్టిందట. సినిమా హిట్టయితే, పారితోషికం +
లాభం రెండూ తీసుకోచ్చని అనుకుంది. కానీ గోదావరి సినిమా నట్టేట ముంచడంతో
ఇటు కెరీర్ కు గాని, అటు ఆర్థికపరంగా గాని ఎలాంటి లాభం చేకూర్చ లేదని
సన్నిహితుల వద్ద వాపోతుందట. రెండు విధాలా నష్టం చేకూర్చిందని తెగ
ఫీలవుతుందట. అయినా ‘చెరువు నీళ్ళు పోయి చెరువు వెనక పడ్డాక ’ ఇప్పుడు
బాధపడితే ఏం లాభం అని సినీ జనాలు తాప్సీ పై కరుణ చూపకుండా నాలుగు చివాట్లు
కూడా పెడుతున్నారు. ముందే మంచు ఫ్యామిలీ... వాళ్ళను నమ్ముకుంటే అంతే
సంగతులు. ఇకనైనా జాగ్రత్తగా ఉండమ్మ నాలుగు రోజులు వెండి తెర పైనైనా
ఉండవచ్చు. అత్యాశకు పోకు అని తాప్సీకి హితభోత చేస్తున్నారట.
No comments:
Post a Comment