Tuesday, 19 March 2013

Kajal Misses Baadshah Audio Launch




Baadshah Audio Launch

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, శీనువైట్ల దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన భారీ చిత్రం బాద్ షా. ఈ చిత్రం షూటింగు దాదాపు పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం యొక్క ఆడియో కార్యక్రమం నిన్న నానక్ రామగూడలోని రామానాయుడు సినీ స్టూడియోలో అంగరంగా వైభవంగా జరిగింది. అయితే ఈ చిత్ర ఆడియోకి కథానాయిక కాజల్ హాజరు కాలేదు. సాదారణంగా హీరో, హీరోయిన్ కచ్చితంగా హాజరు అవుతారు. కానీ కాజల్ హాజరు కాలేదు. కారణం ఆమె ప్రస్తుతం పొల్లాచ్చిలో ఓ తమిళ సినిమా షూటింగులో ఉంది. ఈ వేడుకకు హాజరుకావడానికి నిర్మాత నుంచి అనుమతి తీసుకుని బయలుదేరింది. అయితే, కోయంబత్తూరు విమానాశ్రయంలో, బోర్డింగ్ పాస్ వున్నా తనని అక్కడి అధికారులు విమానంలోకి అనుమతించలేదని, అందుకే హాజరుకాలేకపోయానని   సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా తెలిసింది. అయితే జూనియర్ అభిమానులు మాత్రం కాజల్ ఏవో పిట్టకథలు చెబుతుందని, కావాలనే హాజరు కాలేదని అనుకుంటున్నారు. మరి దీనికి గాను ఈ అమ్మడు పై నిషేదం విధించరు కదా..?

No comments:

Post a Comment