Wednesday, 13 March 2013

Pawan Kalyan Doing Driver Role

 

 
pawan-trivkram

మాటల మాత్రికుడు, ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో కామెడీ అండ్ ఎంటర్ టైనర్ గా సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘సరదా ’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త టాలీవుడ్ లో సంచరిస్తుంది. ఈ సినిమాలో ‘పవన్ కళ్యాణ్ కారెక్టర్ ట్యాక్సీ డ్రైవర్ పాత్ర ’ అని సమాచారం.  సమంతా, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో పవన్ చాలా సరదాగా, కామెడీగా కనిపించనున్నాడట. ఇక బాలీవుడ్ నటుడు బోటన్ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో సమంతా తల్లిగా నదియా నటిస్తున్న విషయం తెలిసిందే. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ చిత్రం ‘జల్సా' చిత్రానికి ఈ చిత్రం డబల్ డోస్‌లా ఉంటుందని, పవన్ కళ్యాణ్ మేనరిజం, త్రివిక్రమ్ పంచ్ డైలాగులు సినిమాకు హైలెట్ కానున్నాయని సమాచారం.

No comments:

Post a Comment