హీరోయిన్లు వెండితెర పై వెలిగిపోవడానికి
ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొందరికి కొన్ని సినిమాలతోనే స్టార్ డమ్ వస్తే,
మరికొందరికి ఎంతో కష్టపడితే కాని రాదు. కొందరికి కష్టపడ్డా అద్రుష్టం లేక
వెనకబడిపోతారు. అలాంటి వారు తోటి హీరోయిన్లకు పోటీనివ్వడానికి గ్లామర్ ని
ఎరగా వేసి అవకాశాలు సంపాదిస్తారు.
ఆ అందాలు అవకాశాలు తెచ్చిపెడితే సరే సరి.
లేకుండా తెరమరుగు అవుతారు. తాజాగా అలనాటి ప్రముఖ హీరోయిన్ అయిన రాధా కూతురు కార్తీక వెండితెర పై తెరంగ్రేటం చేసినా అంతగా ఫేమస్ కాలేకపోయింది.
ఆమె తాజాగా తమిళంలో ప్రముఖ చిత్రకారుడు అయిన రవివర్మ జీవితం ఆధారంగా
తెరకెక్కుతున్న 'మకరమంజు ' సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో ఆమె కొన్ని
సన్నివేశాల్లో నగ్నంగా నటిస్తుందని సినిమా వర్గాల సమాచారం. ఆ వార్తలకు
స్పందిస్తూ ‘తన అందచందాలతో ఓ రాజును బుట్టలో పడేయాల్సిన పాత్ర అది. మరో
పాత్రలో చిత్రకారుడికి మోడల్ గా ఉంటా. అలాంటి సన్నివేశాల్లో ఎలా నటిస్తే
బాగుంటుందో ఒక్కసారి కళా దృష్టితో చూడండి. మీకే అర్థమవుతుంది. దానిని
నగ్నత్వం అంటే నేనొప్పుకోను’ అంటూ కార్తీక అభిప్రాయపడింది. ఒకవేళ నిజంగానే
ఆమె నగ్నంగా నటిస్తే మాత్రం అది హైలెట్ అవుతుందని అంటున్నారు.
No comments:
Post a Comment