ఏదీ
మనస్సులో దాచుకోకుండా. అందరి ముందు ఓపెన్ గా చెప్పే మన తెలుగు హీరోయిన్.
తెలుగమ్మాయి హీరోయిన్ గా వెండితెర పై కనిపిస్తూ.. ఇమేజ్ ఉన్నప్పట్లో
సంపాదించుకోవాలే అనే సూత్రం నడుస్తున్న సీతమ్మ. తన నటనతో రెండు రాష్ట్రాల
సినీ ప్రజలకు పరిచయం అయిన గోదావరి పిల్ల హీరోయిన్ అంజలి. ఈ తెలుగు
హీరోయిన్ పేరు టాలీవుడ్ టూ కోలీవుడ్ నిర్మాతలు జపం చేస్తున్నారు.
సంక్రాంతి సంబరాల్లో సిల్వర్ స్క్రీన్ పై సీతమ్మగా కనిపించిన అంజలి
ఇప్పుడు అందరికి కావాలట. అంటే అందుకోసం కాదులేండి? అంజలి ఉంటే సినిమా
హిట్ అనే స్థాయికి ఈ తెలుగు పిల్ల ఎదిగిపోయింది. గోదావరి యాసతో సినీజనాలకు
తెగ నచ్చినట్లు సమాచారం. అంజలి కోసం కొంత మంది నిర్మాతలు ఆమె ఇంటి చుట్టు
తిరుగుతున్నట్లు టాలీవుడ్ టాక్. మొదటిగా అంజలి తెలుగు తెర మీదనే
కనిపించింది. కానీ అప్పుడు అంజలిలో ఉన్న అందమే చూశారు గానీ, ఆమెలో నటనను
టాలీవుడ్ దర్శకులు గుర్తించలేపోవటం దారుణమైన విషయం. అయితే కోలీవుడ్
మాత్రం కొత్త వారిని కత్తిలాగ తయారు చేసి, తెరపైకి వదులుతారు అనే విషయం
హీరో విక్రమ్, హీరోయిన్ అంజలి లాంటి వారితో నిజమైంది. అయితే ఈ తెలుగు
సీతమ్మకు మంచి డిమాండ్ ఏర్పాడినట్లు సినీ వర్గాల సమాచారం. ఇటీవల తమిళ
సినిమాలో ఐటమ్ సాంగ్ అంజలి చేసినట్లు తెలుస్తోంది. హీరో సూర్య నటిస్తున్న
సింగం-2 సినిమాలో అంజలి నాలుగు నిమిషాల ఉన్న ఒక ఐటమ్ సాంగ్ చేసినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
సినీ ప్రపంచంలో హీరోయిన్లకు ఐటమ్ సాంగ్ అనేది ఒక ఫ్యాషన్ గా
మారిపోయింది. కష్టపడటం తక్కువా.. కాసులు భారీగా రావటంతో.. స్టార్ హీరోయిన్
అయిన.. ఐటమ్ పాపగా మారిపోతుంది. గతంలో.. ఫ్రియమణి, శ్రియ, నయనతార, లాంటి
తారలు ఐటమ్ సాంగ్ చేసిన వారే. అయితే ఇప్పుడు కొత్తగా. హీరోయిన్ అంజలి
కూడా వారి జాబితాలో చేరిపోయింది. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో ఎదుగుతున్న
అంజలి.. కోలివుడ్ లో ఐటమ్ సాంగ్ చేయటం పై కొన్ని విమర్శలు
వినిపిస్తున్నాయి. అలాంటి విమర్శలను అంజలి చాలా లైటుగా తీసుకున్నట్లు
టాలీవుడ్ సమాచారం. ఈ ఐటమ్ సాంగ్ లో అంజలి తన అందచందాలతో తమిళ తంబీలను
అలరించటానికి నాలుగు నిమిషాలు సాంగ్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే అంజలి తన అందాలను తమిళ తంబీల ముందు ఆరబోసినందుకు గాను 20 లక్షలు
రెమ్యునరేషన్ తీసుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అంటే హీరోయిన్
అంజలి ఒక్క సినిమాకు తీసుకొనే రెమ్యునరేషన్ ల్లో సగం తీసుకున్నట్లు
సినీ వర్గాలు అంటున్నాయి. అందం ఉన్నప్పుడే .. ఆర్థికంగా పైకి ఎదగాలనే
ఆలోచనలతో తెలుగు పిల్ల అంజలి ముందుకు పోతున్నట్లు తెలుస్తోంది. కాంతి
ఉన్నప్పుడే.. కాసులు రాబట్టుకోవలనే సినిమా సిద్దాంతాన్ని అంజలి
పాటిస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి.
No comments:
Post a Comment