రాము కలల సుందరి శ్రీదేవి కన్నెర్రజేసింది. వర్మాయ్ చేష్టలతో అతిలోక సుందరికి ఆగ్రహం వచ్చినట్లు తెలుస్తోంది. తీవ్ర దుమారం రేపుతున్న తాజా సినిమా ‘శ్రీదేవి’ సినిమాపై అతిలోక సుందరి ‘శ్రీదేవి’ కూడా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన పేరును ఇలాంటి సినిమాలకు వాడుకోవటాన్ని ఖండిస్తూ.. వర్మకు లీగల్ నోటిసు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు శ్రీదేవి తరపున న్యాయవాదులు పంపిన లీగల్ నోటిసు ప్రతి పేరుతో మీడియాలో వార్తలు ప్రచురితం అవుతున్నాయి. ఈ వార్త ఎంతవరకు నిజమో.., శ్రీదేవి పేరుతో ఉన్న నోటిసుల్లో ఉన్న వాస్తవం ఎంతో తెలియదు కాని ఇదే నిజం అయితే మాత్రం వర్మకు కష్టాలు తప్పవు.
శ్రీదేవి పంపినట్లుగా మీడియాలో ప్రచురితం అయిన నోటిసు ప్రతి ఇదే...
Click Here to View Full Notice
No comments:
Post a Comment