అలనాటి డాన్సర్ జ్యోతిలక్ష్మి జీవితాన్ని సినిమాగా తీస్తున్నట్లు జరిగిన ప్రచారానికి తెరపడింది. ‘జ్యోతిలక్ష్మి’ జీవితంపై తాను సినిమా తీయటం లేదు అని డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రకటించారు. ఈ విషయంపై కొద్ది రోజులుగా జరుగుతున్ ప్రచారంకు పూరి ముగింపు పలికారు. తాను తీయబోయే ‘జ్యోతిలక్ష్మి’ వేరు ప్రచారంలో ఉన్న ‘జ్యోతిలక్ష్మి’ వేరు అని వివరణ ఇచ్చారు. డాన్సర్ జ్యోతి లక్ష్మికి తన సినిమాలోని జ్యోతి లక్ష్మికి సంబంధం ఉండదన్నారు. ఇక తన సినిమాపై మరొక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారాయన. అదేమంటే ఈసినిమా కధను ఓ నవల నుంచి తీసుకున్నట్లు చెప్పారు. ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ఓ నవల ఆధారంగా ఈ సినిమాను చేస్తున్నట్లు చెప్పారు.
Click Here to View Full Story
Click Here to Know Latest Tollywood Updates
No comments:
Post a Comment