సాధారణంగా చిత్రపరిశ్రమలో వున్న హీరోయిన్ల మధ్య అప్పుడప్పుడు తగాదాలు రావడం సహజం! అవి వ్యక్తిగత విషయాలు కావొచ్చు లేదా సినిమాపరంగా కావొచ్చు కానీ.. మరీ ఒకరి జీవితాన్ని మరొకరు నాశనం చేసుకునేంత పగ-ప్రతీకారాలు మాత్రం పెంచుకోరు. కొన్నాళ్ల తరువాత ఏదో ఒక విధంగా తారల మధ్య వుండే దూరం తగ్గిపోతుంది. అయితే ఇక్కడ అంజలి విషయం మాత్రం చాలా గందరగోళంగా వున్నట్లు తెలుస్తోంది. ఒక ఐటమ్ గర్ల్, ఇంకొక అగ్రతార వల్ల తన కెరీర్ ఎక్కడ నాశనమవుతుందోనన్న భయాందోళనల్లో అంజలి వున్నట్లు భావిస్తోంది. ఇప్పుడు కెరీర్ మొత్తం గాడిలో పడి చిన్న సినిమాల ద్వారా మెల్లగా కోలుకుంటున్న అంజలికి... అనుకోకుండా ఆ ఇద్దరు భామలు తన కెరీర్ కే ఎసరు పెట్టే విషయాన్ని జీర్ణించుకోలేకపోతోందని సమాచారాలు వస్తున్నాయి.
Click Here to View Full Story
Click Here to View Full Story
No comments:
Post a Comment