కోలివుడ్ హ్యాండ్ సమ్ హీరో సూర్య తాజా సినిమా ‘మాస్’ ఫస్ట్ లుక్ విడుదల అయింది. దీపావళి కానుకగా ప్రేక్షకుల కోసం మంగళవారం రోజు ఈ లుక్ ను విడుదల చేశారు. కధకు తగ్గట్లుగానే ఫస్ట్ లుక్ లో సూర్య ఆవేశంగా కన్పిస్తున్నాడు. ఈ ఫొటో చూసినవారంతా హాలీవుడ్ రేంజ్ లో ఉంది అని అంటున్నారు. హారర్ కధ, కామెడి కధాంశంతో రూపొందుతున్న ఈ సినిమా లుక్ చూసినవారంతా సూర్య సూపర్బ్ అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.
Click Here to View Full Details
No comments:
Post a Comment