ఫ్యామిలి సినిమాలు చేసి సక్సెస్ పొందిన హీరో విక్టరీ వెంకటేష్ మరో కుటుంబ కధా చిత్రం చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. అదికూడా ఆషామాషి డైరెక్టర్ తో కాదు. ఫ్యామిలి సినిమాలో తీయటంతో సిద్దహస్తుడుగా ముద్రపడిన దశరథ్ తో సినిమా చేస్తున్నాడట. ఈ మద్య వెంకీని కలిసిన దశరధ్ ఓ కధ చెప్పారట. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. ఈ కధ ఓకే అయితే వచ్చే ఏడాది సినిమా సెట్లపైకి వెళ్లవచ్చు అని తెలుస్తోంది.
Read More....
No comments:
Post a Comment