Monday, 20 October 2014

రీల్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్న రాకింగ్ స్టార్


విభిన్న కథాచిత్రాలతో టాలీవుడ్ రాకింగ్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజీని క్రియేట్ చేసుకున్న మంచు మనోజ్... రీల్ లోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ నిజమైన హీరోగా పేరు సంపాదించుకున్నాడు. అదెలాఅంటే.. మొన్నొచ్చిన ‘‘హుధుద్’’ తుపాను భీభత్సానికి విశాఖపట్నం మొత్తం అతలాకుతమైన నేపథ్యంలో టాలీవుడ్ హీరోలందరూ తమదైన రీతిలో సహాయాన్ని అందించారు. కొందరు డబ్బుల రూపంలో విరాళాలు అందిస్తే.. మరికొందరు ఫుడ్ ప్యాకెట్లను అందించారు. అయితే రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాత్రం వీరందరికీ భిన్నంగా ఆ నగరవాసులకు సహాయాన్ని అందించి, వాళ్ల దృష్టిలో నిజమైన హీరోగా నిలిచిపోయారు.

Source: Teluguwishesh

No comments:

Post a Comment