హీరో ప్రభాస్ తాజా సినిమా బాహుబలి షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. ప్రస్తుతం రామోజి ఫిలిం సిటిలో సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇక్కడ పలు ఫైట్ సీన్లను షూట్ చేస్తున్నారు. శనివారం రోజు ఫైట్ సీన్ లో భాగంగా.., భారీగా కుంకుమను చల్లేందుకు పేలుడు పధార్ధాలు ఉపయోగించారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు అవి పేలి మంటలు వ్యాపించాయి. దీంతో ఫైట్ సీన్ లో నటించాల్సిన నలుగురు ఫైటర్లు సతీష్, పాండు, గణేష్, సంతోష్ కు స్వల్ప గాయాలు అయ్యాయి.
Click Here to View Full Story
Click Here to Know Latest Tollywood Updates

No comments:
Post a Comment