ఇంతవరకు కనిపించని కొత్తకోణంలో చాలా స్టైలిష్‌గా యంగ్ టైగర్ జూనియర్ యన్.టి.ఆర్ 'బాద్‌షా'లో కనిపించబోతున్నాడన్న సంగతి మనకు తెలిసిందే. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాలను రూపొందించడంలో పేరుపొందిన శ్రీను వైట్ల ఈ చిత్రాన్ని ప్రేక్షకాభిమానులు అన్నివిధాలా సంతృప్తిచెందేలా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.
మాఫియా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు చక్కటి వినోదాన్ని కూడా మేళవించారట. ఇక కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం కోసం రెండు మేజర్ షెడ్యూల్స్ ను ఇటలీ, బ్యాంకాక్‌లలో పూర్తిచేశారు.
కాగా నెగటివ్ పాత్రను పోషిస్తున్న నవదీప్ కూడా ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. గత శ్రీను వైట్ల చిత్రాలలో బ్రహ్మానందం పాత్రలు ఎంతబాగా పండాయో వేరుగా చెప్పనక్కరలేదు. ఈ చిత్రంలో కూడా అత్యంత ప్రాధాన్యం వున్న పాత్రను ఆయన పోషిస్తున్నారని అంటున్నారు. ఇక ప్రతినాయకుడిగా కెల్లి దోర్జి నటన చాలా స్పెషల్ అని వినికిడి.
బాద్‌షా చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తుండగా, గోపీమోహన్, కోన వెంకట్‌లు స్క్రిప్టును అందిస్తున్నారు. కొత్త ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది
No comments:
Post a Comment