విభిన్న కథాంశంతో తెరకెక్కిన
సందేశాత్మక చిత్రం ‘మిణుగురులు’. ఈ చిత్రాన్ని చూసిన మెగాస్టార్ చిరంజీవి
ప్రసంశలతో ముంచెత్తారు. సినిమా ఆద్యంతం హృదయానికి హత్తుకునే విధంగా ఉందని,
అంథ బాలలచే చక్కని కథ, కథనాలతో దర్శకుడు అయోధ్యకుమార్ ప్రేక్షకుల హృదయాలను
హత్తుకునే విధంగా రూపొందించారని చిరు ప్రశంసించారు. అంతేకాదు.. ఇటువంటి
చిత్రాలు చాలా అరుదుగా వస్తాయన్నారు.
అయోధ్యకుమార్ కృష్ణంరెడ్డి స్వీయ
దర్శకత్వంలో ఆయనే నిర్మాతగా ‘రెస్‌ఫెక్ట్ క్రియేషన్స్’ బ్యానర్‌లో
నిర్మించిన ఈ సినిమాని కేంద్ర మంత్రి చిరంజీవి ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ
థియేటర్‌లో రెండుగంటలసేపు చూశారు. మరో కేంద్ర మంత్రి కిల్లి కృష్ణారాణి
కూడా సినిమాచూసి చిత్రవర్గాన్ని అభినందించారు. హీరోగా నటించిన మాస్టర్
దీపక్ చాలా బాగాచేశాడని కితాబిచ్చారు.
అయోధ్యకుమార్ మాట్లాడుతూ ‘మా
చిత్రాన్ని చూడ్డానికి, మాకు ఉత్సాహాన్ని కలిగించడానికి మెగాస్టార్ రావడం
సంతోషంగా ఉందని, ఈ చిత్రాన్ని అందరికీ నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా
రూపొందించడం జరిగిందని అన్నారు.
దీపక్, సుహాసిని మణిరత్నం, అశిష్ విద్యార్థి, రఘువీర్ యాదవ్ ముఖ్యతారాగణం.
...avnk
No comments:
Post a Comment