Saturday, 22 December 2012

Bindu Madhavi Movie Updates

9
       
              బిందుమాధవి.. అదేనండీ.. 'ఆవకాయ్ బిర్యాని' తో తెలుగు ప్రేక్షకులకు ఘుమ ఘుమలందించిన చిన్నది. ఇప్పుడు బిత్తరపోయిందంట.. ఏసందర్భంలో అనుకుంటున్నారా.. గతంలో విజయ కాంత్ హీరోగా చేసిన సూపర్ హిట్ 'సట్టం ఒరు ఇరుట్టరై' మూవీని  ఇటీవల హీరో విజయ్ తన సొంత బ్యానర్లో రీమేక్ చేశాడు. అయితే ఈ సినిమాలో ఆయన నటించలేదు. తమన్ కుమార్, బిందుమాధవి, రీమాసేన్, పియా బాజ్ పేయి  పాత్రలు పోషిస్తున్నారు.
       ఈ సినిమాకి సంబంధించి ఓ పాటను బిందుమాధవి పై చిత్రీకరిస్తూ వుండగా, అక్కడికి హీరో విజయ్ వచ్చాడట. అతను మంచి డాన్సర్ కావడంతో విజయ్ వెళ్లిపోయాక డాన్స్ చేస్తానంటూ బిందు మొండికేసిందట. విషయం తెలుసుకున్న విజయ్,  ఆమె డాన్స్ చూసే వెళతానని మొరాయించాడట. దాంతో బిందు మాధవికి ఆయన ఎదుట స్టెప్పులు వేయక తప్పలేదు. అయితే ఆమె పాట చిత్రీకరణ పూర్తయ్యాక, చాలా బాగా చేశావంటూ విజయ్ ఆమెను అభినందించాడట. ఈ విషయన్ని ట్వీటిచ్చి మరీ సంబరపడిపోతుంది బిందు.
8
        ఈ సంగతిలా ఉంటే, ఈ చిత్ర షూటింగ్ హాంకాంగ్ లో జరుగుతున్నప్పుడు హెలికాప్టర్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా, బిందుమాధవి, మరో నటి పియా బాజ్ పాయ్.. చాపర్ నుంచి జారి కింద పడిపోవడంతో వీరిద్దరికీ దెబ్బలు తగలటంతో షూటింగ్ కు అంతరాయం ఏర్పడి మళ్లీ ఇప్పడు జోరందుకుంది. అంతేకాదు ఈ చిత్రం అనుకున్నప్పటి నుంచీ బిందు ఏదో ప్రమాదంలో పడుతుండటం గమనార్హం. సెప్పెంబర్ మొదటి వారంలో బిందు మాధవి తమిళనాడులోని తిరుచునాపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకుని బయటపడింది.

No comments:

Post a Comment