Friday, 14 December 2012

Vidya Balan Marriage Celebrations

విద్యాబాలన్ చీరకడితే ఆ చీరకే అందం వస్తుంది. అందులో ఎవరికీ సందేహంలేదు. సినిమా కోసం కడితేనే ఇలా ఉంటే,  ఇవాళ జరుగుతోన్న ఆమె పెళ్లి పండుగలో ఎలా ఉంటుందని మీకు ఆశగా ఉంటుందని మాకు తెలుసు. ఇదుగో అందుకే మీకోసం.. విద్యా ఉదయం జరిగిన మెహందీ ఫంక్షన్లో విద్యాబాలన్ ఏ చీర ధరించిందో, ఎలా సింగారించుకుందో చెప్పకనే చెప్పే ఫొటోను అందిస్తున్నాం చూసి ఎంజాయ్ చేయండి ఫోక్స్..
1
        ఇంకా పెళ్లి సంగతులేంటంటే.. విద్యా తన పెళ్ళికి ఏకంగా 18 పట్టు చీరలు తన అభిరుచి మేర డిజైన్ చేయించుకుంది. దక్షిణాది వస్త్ర శైలిని ప్రతిబింబించేలా ఈ చీరలను ప్రముఖ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేశారు. వీటికి కావలసిన పట్టును తమిళనాడులోని కంచి నుంచి ప్రత్యేకంగా తెప్పించారు.  ఇక తన కాబోయే శ్రీమతికి బహుమతిగా ఆమె ప్రియుడు సిద్ధార్థ్ రాయ్ కపూర్ ఓ ఆధునాతన ఇంటిని కొనుగోలుచేసి, అద్భుతంగా ఇంటీరియర్ డెకరేషన్ చేయించాడు. ముంబయ్ జుహూ ప్రాంతంలోని తారా రోడ్డులో తీసుకున్న ఈ ఫ్లాట్ విలువ 14 కోట్ల రూపాయలని భోగట్టా.
       ముంబాయ్ చెంబూర్ లోని సుబ్రహ్మణ్య సమాజ్ దేవాలయంలో ఇవాళ విద్యా, సిద్ధార్థ్ ల వివాహం వైభోగం షురూ కానుంది. బాలీవుడ్ కే కాదు మన తెలుగు సినీ ప్రియులకూ అభిమాన నటి అయిన విద్యాబాలన్ కు  తెలుగు ప్రేక్షకుల తరపున పెళ్లి వేళ శుభాకాంక్షలు చెబుతోంది.. తెలుగువిశేష్.కాం..        
...avnk

No comments:

Post a Comment