Friday, 21 December 2012

Ram Charan With Hot Charmi

chh
      
                హీరోయిన్ గా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో ముద్దుగుమ్మ చార్మీ ఐటెం సాంగుల వెంట పరుగులు పెడుతున్నట్టు కనిపిస్తుంది. ఇటీవలే 'సక్కూభాయ్ ...గరమ్ చాయ్...' అంటూ 'ఢమరుకం' సినిమాలో హాట్ హాట్ గా సందడి చేసిన చార్మి త్వరలో చరణ్ తో కలిసి చిందేయబోతున్నట్టు వినికిడి. రామ్ చరణ్ హీరోగా వీవీ వినాయక్ రూపొందిస్తున్న భారీ చిత్రం 'నాయక్' లో ఓ ఐటెం పాటలో నటించడానికి చార్మీ అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ ఐటెం సాంగ్ హైదరాబాదులో సెట్స్ లో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు.
         చరణ్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న నాయక్ చిత్రంలో కాజల్ అగర్వాల్, అమలా పాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. జనవరి 9 న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
daaa
        ఇదిలా ఉంటే,  ఇటీవల 'నాయక్' ఆడియో వేడుకలో రామ్ చరణ్ మాటతీరు, అనంతరం చోటుచేసుకున్న మీడియా వ్యాఖ్యానాలమీద చరణ్ బాబాయ్ నాగబాబు స్పందించారు. చరణ్ వయసులో చాలా చిన్నవాడనీ, అతని ఆవేదనను అర్ధం చేసుకోవాలే గానీ, ఆవేశాన్ని తప్పుపట్టడం భావ్యం కాదని అన్నారు. ఏదేవైనా చరణ్ తొందరపడి మాట్లాడినందుకు అతని తరఫున తాను క్షమాపణ చెబుతున్నానని అన్నారు.
nagaaa     ఆఖరి మజిలీ :  నిన్న పుస్తకావిష్కరణ సభలో దాసరి చేసిన ప్రసంగం అనంతరం చోటుచేసుకున్న గుసగుసలకు అనూహ్యంగా శుభంకార్డు పడింది. ఎలాగంటే.. దాసరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల గురించి ఓ టీవీ ఛానల్ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమం నడుస్తుండగా, సదరు చానల్ కి దాసరి ఫోన్ చేశారు. చిరంజీవితో తనకి ఎలాంటి విబేధాలు లేవనీ, తాను చేసిన వ్యాఖ్యలు చిరంజీవిని ఉద్దేశించి కాదని తేల్చిచెప్పటం కొసమెరుపు.
...avnk

No comments:

Post a Comment