నాయక్
ఆడియో ఫంక్షన్ లో మీడియా పై రెచ్చిపోయిన రామ్ చరణ్ గురించి తెలిసిందే.
రామ్ చరణ్ లో ఆపైర్ , ఆ పవర్ ఇంక తగ్గలేదని అంటున్నారు టాలీవుడ్ వాసులు.
నాయక్ ఆడియో ఫంక్షన్ ఎంతో గ్రాండ్ గా విడుదల చేసినవిషయం తెలిసిందే. అయితే
ఆడియో పాటలతో పాటు నాయక్ సినిమాలో ఒక వీడియో సాంగ్ యూట్యూబ్ నుండి ,
ఫేస్ బుక్ అంతటా హల్ చల్ చేస్తోందని సినీ అభిమానులు అంటున్నారు. అయితే
నాయక్ సినిమాలో ఆ సాంగ్ కోసం రామ్ చరణ్ , హీరోయిన్లు చాలా కష్టపడి
డ్యాన్సు చేసినట్లు తెలుస్తోంది. ఆ సాంగే ఆ సినిమాకు మంచి హైలెట్ అని
సీనిమా యూనిట్ సభ్యులు అంటున్నారు. కానీ అలాంటి సాంగ్ ను ఎవరు లీక్ చేశారో
తెలియాదు గానీ నెట్ లో మాత్రం నాయక్ వీడియో సాంగ్ రచ్చ రచ్చ చేస్తుంది.
దీని పై మోగా అభిమానులు నిరాశ గా ఉన్నారు.
తమ
అభిమానా హీరో సినిమా విడుదల కాకముందే ..ఇలా నెట్ లో రావటం పై అందరు నిరాశ
చెందినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ తన
సిబ్బందిని పిలిచి మండిపడినట్లు టాలీవుడ్ టాక్. అంతేకాకుండా
ఒకరిద్దరిపై రామ్ చరణ్ చేయి కూడా చేసుకున్నాడని ఫిలింనగర్లో పుకార్లు
షికార్లు చేస్తున్నాయి. మేము ఒళ్లు హూనం చేసుకుని కష్టపడి చేసిన
డ్యాన్స్ ని తెరపై కాకుండా ఇలా ఫ్రీ గా బయటకు రావటం పై రామ్ చరణ్
బాధపడుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ వీడియో సాంగ్ ను లీక్ చేసిన
వ్యక్తుల కోసం రామ్ చరణ్ వివరాలు సేకరిస్తున్నట్లు మెగా అభిమానులు
అంటున్నారు.
No comments:
Post a Comment