గతంలో వేసిన అడుగుల్లో చాలా తప్పులున్నాయాని ఇప్పుడు తెలుసుకుంది. అప్పుడు వేసిన తప్పటడుగుల వలన ఎంత నష్టం జరిగిందో అప్పుడు తెలియాలేదని చెబుతుంది. అయితే ఇప్పుడు అమలాపాల్ తాజాగా ఓ గట్టి నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే, వివాదాలు కొని తెచ్చుకోకూడదని ! అంటే..అలాంటి తరహా చిత్రాలలో ఇకపై నటించదట. దీనికో కారణం వుంది. ఈ మల్లూ బేబీ నటించిన తొలి చిత్రం పేరు 'సింధు సమవెలి'. అందులో అమలాపాల్ పాత్ర తీరుతెన్నూ విభిన్నంగానూ, విమర్శలకు దారితీసేలా ఉంది. ఆ మలయాళ సినిమా అప్పట్లో పెద్ద వివాదం అయింది. అమలా ఎన్నో విమర్శలు ఎదుర్కొంది.
దాంతో ఇప్పుడీ నిర్ణయం తీసుకుంది. 'మొదట్లో ఎలాంటి సినిమాలు చేయాలన్నది నాకు అస్సలు తెలిసేది కాదు. కథలు వినాలన్న విషయం కూడా నాకు తెలియదు. అందుకే కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా. 'సింధు సమవెలి' సినిమా అలా చేసిందే. అమ్మో..ఆ సినిమా రిలీజయ్యాక విమర్శలు తట్టుకోలేకపోయాను. బయటకు వెళ్లాలంటేనే సిగ్గేసింది. ఆ దెబ్బతో మొత్తం తెలిసొచ్చింది. ఇప్పుడు కథ, పాత్ర వినకుండా అస్సలు ఏ సినిమా కూడా ఒప్పుకోవటం లేదు. ఏమాత్రం కాంట్రవర్సీ ఉందనిపించినా తిరస్కరిస్తాను' అని అంటోంది. అయితే అమలా అలాంటి కండిష్సన్, కాంట్రవర్సీలు పెడితే తెరపై కనిపించటం చాలా కష్టమాని సినీజనాలు అంటున్నారు. కొన్నిటిని చూసి చూటనట్టుగా పోవాలి. అప్పుడే అరుదైన అవకాశాలు వస్తాయని సీనియర్ భామలు సలహాలు ఇస్తున్నారు.