Tuesday, 28 May 2013

Shruti Haasan Slips Near Swimming Pool

Shruti Haasan Slips Near Swimming Pool

  • కాలు జారిన శ్రుతి హాసన్


    Shruti Haasan slips near swimming pool.png

    విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురు సినిమా ఇండస్ట్రీకి వచ్చి తనదైన స్టైల్లో దూసుకుపోతుంది. ఈ మధ్యన ఈ అమ్మడు బరితెగించి మరీ హాట్ హాట్ గా ఫోజులు ఇస్తూ, నటిస్తూ అందరి మతి పోగొడుతుంది. ఈ మధ్యనే అమ్మడు కాలు జారిందట కూడా. ఇలా కాలు జారడం సినిమా వాళ్లకు అలవాటే కదా ? అని తప్పుగా అర్థం చేసుకోకండి. విషయం ఏంటంటే... సినిమా షూటింగుల్లో ముద్దుగుమ్మలు కాలు జారి పడి మరీ దెబ్బలు తగిలించుకుంటారు.

     ఇక్కడ కూడా శ్రుతి హాసన్ కి అదే జరిగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన ‘రామయ్యా వస్తావయ్యా ’చిత్రంలో నటిస్తున్న శ్రుతి స్విమ్మింగ్ పూల్ వద్ద ఓ సన్నివేశాన్ని చిత్రీకరించే సమయంలో దర్శకుడు ప్రభుదేవాతో మాట్లాడుతూ వస్తున్న శృతి, ఉన్నట్టుండి కాలుజారి కిందపడిపోయింది. దాంతో దెబ్బలు తగలడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయించారట. ఈ విషయం తెలుసుకున్న సినిమా జనాలు మాత్రం శ్రుతి మించిన ఎక్స్ పోజింగులు ఇస్తున్న ఈమె నిజంగానే కాలు జారిందేమో అని చెవులు కొరుక్కుంటున్నారు.


No comments:

Post a Comment