Allu Sirish And Yami Gautam Dating
మెగా
ఫ్యామిలీ హీరోగా వెండితెరకు ‘గౌరవం ’గా పరిచయం అయిన అల్లు అరవింద్ రెండో
కుమారుడు అల్లు శిరీష్ కి ఆ సినిమా అనుకున్నంత గౌరవాన్ని తీసుకరాలేక
పోయింది. ఈ సినిమా విడుదల తరువాత ఈయనలో హీరో లక్షణాలు ఏమి కనిపించడం లేదని
నటనలో ఓనమాలు కూడా నేర్చుకోలేదని తేల్చేశారు ప్రేక్షకులు. తన ఫ్యామిలీకి
ఉన్న సినిమా బ్యాక్ గ్రౌండ్ ని ఉపయోగించుకుకొని బాగా పబ్లిసిటీ చేసుకున్న
ఈయనకు అగౌరవం మాత్రమే మిగిలింది. సినిమా రిజల్టులో తేడా ఉన్నా మనోడి పై
మాత్రం పుకార్లు బాగానే వచ్చాయి. ‘గౌరవం ’ సినిమలో హీరోయిన్ గా చేసిన యామీ
గౌతమ్ తో మనో ప్రేమాయణం మొదలు పెట్టాడని, వీరిద్దరు బహిరంగానే
చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారని, ఐపీఎల్ మ్యాచ్ లలో కలిసి కనిపించి
తెగ సందడి చేసిన వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అనుకున్నారు.
అయితే ఈ
వార్తల పై స్పందించిన యామీ గౌతమ్ అబ్బే నేను మెగా హీరోతో డేటింగ్ చేయడం
లేదని, మా మధ్య ఎలాంటి బంధం లేదని, కేవలం మంచి స్నేహితులం మాత్రమే అని
చెప్పింది. అయితే ఇన్ని రోజులు రాసుకు పూసుకు తిగిరి ఇప్పుడు ఫ్రెండ్స్
మాత్రమే అని చెబుతుందని సినీ జనాలు అంటున్నారు.
No comments:
Post a Comment