అందాలు
ఆరబోస్తే హీరోయిన్ కాదు... పాత్రకు తగ్గట్లు అందం, నటన ఉండాలని రాగాలు
తీస్తూ చెబుతుంది అందాల సుందరి రచనా మౌర్య. అప్పుడెప్పుడో వెండితెర పై
ప్రవేశించి ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా అన్ని
భాషల్లో సినిమాలు తీసిన ఈ అమ్మడు తెలుగు సినిమాల్లోకి అందమైన అబద్దంతో
అడుగుపెట్టి పలు చిత్రాల్లో నటించింది.
గత కొంత కాలం నుండి ఇటు తెలుగులోనే
కాకుండా ఏ భాషలో కూడా సరైన అవకాశాలు లేవు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ
ఈ అమ్మడు రకరకాల పాత్రలు చేయాలనుంది. పాత్ర పరిధి, దాని బాగోగులు తప్ప ఏమీ
ఆలోచించను, పాత్రనచ్చితే గ్లామర్ పాత్రనైనా సై అని సెలవిచ్చింది.
వెండితెర పై కేవలం అందాలు ఆరబోస్తే సినిమా హీరోయిన్ కాదని, యాడ్ ఫిలిం
హీరోయిన్ అవుతుందని చెప్పింది. మరి ఈ అమ్మడు ఎవరి ఉద్దేశించి అన్నదో మరి.
No comments:
Post a Comment