Monday, 28 January 2013

Anushka Busy In Tollywood


Anushka

  తెలుగు సినిమాల్లో ఈ మధ్య కాలం లో మనం మరచిపోలేని, మనకు మరపు రాని తార, అనుష్క. సూపర్ తో నాగార్జున సరసన ఎంట్రి ఇచ్చిన ఈ భామ, ఆనతి కాలం లోనే తిరుగులేని డిమాండ్ సంపాదించుకుంది. అటు నాగ్ వంటి సీనియర్ హీరోల సరసన, ఇటు ప్రభాస్, మహేష్ బాబు వంటి క్రేజీ హీరోల సరసన నటించి, అందాల ఆరబోత లోను, 'అరుంధతి' వంటి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు పోషించడం లోను, తనకు తానే సాటి అనిపించుకుంది.  అయితే అనుష్క ఎత్తుకు తగ్గ హీరోలు, తెలుగు సినీ పరిశ్రమలో అర కోరగా ఉండటం కొత్త హీరోయిన్ లు అవకాశాలు అందిపుచ్చుకోవడం వల్ల, అనుష్క తెలుగు తెరకు ఒక రెండు సంవత్సరాలు దూరం అవ్వాల్సి ఒచ్చింది.
అయితేనేం, అటు తమిళం లో కూడా ఈ భామ, విక్రం సూర్య వంటి హీరోల సరసన నటించి తన హవా కొనసాగించింది. త్వరలో కార్తి తో అనుష్క నటించిన చిత్రం, ఇరు భాషల్లోనూ విడుదలకు సిద్ధం అవుతోంది. ఇది ఇలా ఉండగా, ఇటు తెలుగు లో, గత సంవత్సరం చివర్లో అనుష్క నటించిన 'ఢమరుకం' విడుదల అయ్యి ఈ భామకు మరొక్కసారి    పేరుని, గుర్తింపునీ తెచ్చిపెట్టింది. ఈ సంవత్సరం, వచ్చే నెలలో, కాస్త గ్లామరస్ పాత్రలో అనుష్క ఇంకొక సారి ప్రభాస్ సరసన 'మిర్చి' లో కనిపిస్తోంది... ప్రభాస్ హీరోగానే రాజమౌళి తీయ్యబోతున్న, ఇంకొక అత్యంత భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం లో కూడా అనుష్క నే కధానాయిక. ఇంతే కాక దర్శకుడు గుణ శేఖర్ నిర్మాతగా మారి, స్వీయ దర్శకత్వం లో నిర్మిస్తున్న 'రాణి రుద్రమ దేవి' చిత్రం లో కూడా అనుష్క 'రాణి రుద్రమ దేవి' గా కనిపించబోతోంది. 
ఇలా వరుస ఆఫర్లతో మరుగున పడిపోయిన తన కరియర్ ని తెలుగు చిత్ర సీమలో మళ్ళీ సక్సెస్ సాధించేలా కృషి చేస్తోంది, అనుష్క.

No comments:

Post a Comment