బక్కపల్చటి గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం
టాలీవుడ్ ని వదిలి బాలీవుడ్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈమె పై గత
కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇలియానా బాలీవుడ్ కి
వెళ్ళిన తరువాత సీక్రెట్ గా ఓ బాయ్ ఫ్రెండ్ ని మెయింటేన్ చేస్తుందని
అంటున్నారు. అయితే ఇప్పుడు ఆ సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ ఎవరో బయట పడింది. ఈమె
సీక్రెట్ గా మెయింటేన్ చేసే భాయ్ ఫ్రెండ్ ఆస్ట్రేలియాకు చెందిన వాడని, అతని
పేరు ఆండ్రూ అని, అతడు ఓ ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్ అని తెలుస్తుంది.
వీరిద్దరి మధ్య గత కొంత కాలంగా ఘాఢమైన బంధం కొనసాగుతుందని, ఒకరి అభిప్రాయాల
ఒకరు బాగా తెలుసుకోవడంతో పాటు అర్థం కూడా చేసుకుంటున్నారని తెలుస్తుంది.
అంతే కాదండోయ్...ఆ మధ్య ఒకసారి ఇలియానా అతన్ని తన ఇంటికి లంచ్‌కి ఇన్వైట్
చేసి తన పేరెంట్స్‌కి పరిచయం కూడా చేసిందట.
బాలీవుడ్ సినిమా అయినా, Phata
Poster Nikhla Hero అనే సినిమా షూటింగులో భాగంగా ఆస్ట్రేలియా వెళ్లిన ఇల్లీ
బేబీ సమయం దొరికినప్పుడల్లా అక్కడ తన బాయ్ ఫ్రెండ్ ను మీట్ అవుతూ తెగ
ఎంజాయ్ చేస్తోందని టాక్. అయితే ఇలియానా మదర్ సమీరా మాత్రం ఈ వార్తలను
ఖండిస్తోంది. ఈ ఇద్దరి మధ్య ఎలాంటి లవ్ ఎఫైర్ లేదని, వారు కేవలం స్నేహితులు
మాత్రమే అని అంటోంది. అయితే బాలీవుడ్ జనాలు మాత్రం పొరుగింటి కూర పుల్లన
అన్నట్లు, ఇక్కడి వారిని వదిలేసి ఆస్ట్రేలియా వాడిని పట్టుకుందని
అనుకుంటున్నారు. మరి ఇల్లి బేబీ ప్రేమాయణం పెళ్లి పీఠలు ఎక్కుతుందంటారా ?
No comments:
Post a Comment