పవర్
స్టార్ పవన్ కళ్యాన్ కొత్త పవనిజంలో తుఫాన్ .. తాకిడి మొదలైంది? ఏ
హీరోయికయినా మూడు నాలుగు ప్లాపులు వరసగా వస్తే ఇక ఇండస్ట్రీలో
నిలదొక్కుకోవడం చాలా కష్టమే. ఎంత పెద్ద అగ్ర హీరోల ఫ్యామిలీ నుంచి
వచ్చిన వారుసులకైనా టాలెంట్ లేనిదే ఈ రోజుల్లో ప్రేక్షకుల్లో ఇమేజ్ ను
సంపాదించుకోవడం ఆషామాషి కాదు. అలాంటిది ఖుషి చిత్రం తర్వాత సరైన
కమర్షియల్ సక్సెస్ లేని పవన్ కళ్యాణ్ దాదాపు పది సంవత్సరాల తర్వాత
గురిచూసి కొట్టిన గబ్బర్ సింగ్ దెబ్బకు తెలుగు ఇండస్ట్రీ రికార్డులు
ఒక్కసారిగా బీటలువారాయి. అంటే ఇంతకాలం పవన్ కళ్యాణ్ మీద ప్రేక్షకులకు
అభిమానం అేదా.. ఒక్కసారిగా పుట్టకొచ్చిందా అని అనుమానాలు రావచ్చు.. ఈ
పదేళ్లుగా పవన్ సినిమాలు ఫెయిలయినా నటుడిగా పవన్ ఏనాడు ఫెయిల్
కాలేదు. ప్రతి అభిమాని గుండెల్లో పవనిజం పనిచేస్తూనే ఉంది. అందుకే
వెంటనే వచ్చిన కెమెరామెన్ గంగతో చిత్రం కూడా కమర్షియల్ రికార్డు స్థాయి
కలెక్షన్లు రాబట్టింది. ఇక పవన్ నటించే తర్వాతి చిత్రంపై ప్రేక్షకులు
అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ పంచ్ డైలాగులు మళ్లీ
జల్లా తర్వాత విని ఎంజాయ్ చేద్దామని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
మళ్లీ పవనిజం మొదలయిందని అంబరాన్నంటే సంబరాలను జరుకుంటున్నారు పవన్ అభిమానులు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందబోయే సినిమాకు ఇప్పటి వరకు టైటిల్ ఖరారు కాలేదు. సరదా, హరే
రామ హరే కృష్ణ టైటిల్స్ వినిపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ చిత్ర దర్శక
నిర్మాతలు టైటిల్ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆ సంగతి అలా ఉంచితే....
తాజాగా మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రానికి ప్రస్తుతం తుఫాన్
అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఏది ఏమైనా అధికా రికంగా ఖరారు అయితే తప్ప
దీన్ని నమ్మలేం. జనవరి 22 నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ
సినిమాలో సమంత మెయిన్ హీరోయిన్ కాగా, సెకండ్ హీరోయి న్‌గా ప్రణీత ఎంపికయింది. ఇప్పటికే పవన్, తివిక్రమ్ కలిసి విదేశాల్లో పర్యటించి సినిమాకు కావాల్సిన లొకేషన్లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment