Monday, 7 January 2013

Prabhas Mirchi Audio Review.

mirchi_ecoastalworld
        
     యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘మిర్చి’. ఇది ప్రభాస్ కు 16వ సినిమాకాగా, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వస్తున్న నాలుగవ చిత్రం. 2013 టాలీవుడ్ మొదటి మ్యూజిక్ ఆల్బామ్ గా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో నిన్న హార్భాటంగా విడుదలైన మిర్చి ఆడియో రివ్యూ మీకోసం..

 మిర్చి... మిర్చి... మిర్చి... మిర్చి... మిర్చి లాంటి కుర్రాడే :
         మాస్ పదాలతో హీరోని వర్ణిస్తూ రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ టైటిల్ సాంగ్ ఇది.  దేవిశ్రీ బాణీలు బావున్నాయ్.  తమిళ సంగీత దర్శకుడు సెల్వకుమార్ భార్య  చిన్నపొన్ను  తెలుగులో తొలిసారిపాడిన పాటఇది. వినేకొలది రుచిస్తుంది.

పండుగలా దిగి వచ్చావు... ప్రాణాలకు వెలుగిచ్చావు :
          కైలాష్ ఖేర్ ఆలపించాడు. ఫ్యాక్షన్ ఎలిమింట్ ని చెప్పడంతో పాటుగా హీరో పాత్రను మరింత ఎలివేట్ చేసే సందర్భోచిత సాంగ్ ఇది.  అంత:పురం సినిమాలోని ‘‘సై చిందేయ్...శిమెత్తర సాంబయ్యా.. పాటను పోలిఉంది.

యాహు... యాహు... బోలో యాహు... యాహు : 
           సింగ్ ఇజ్ కింగ్ ఫేం... మికా సింగ్ గాత్రం బావుంది. పేలవమయిన సాహిత్యం. విజువల్ గా ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంది.

కాటుక కళ్ళను చూస్తే పోతుందే.. మది పోతుందే :
          హీరో- హీరోయిన్ ల మధ్య సరదాగా సాగిపోయే లవ్ డ్యూయేట్ ఇది. విజయ ప్రకాష్, అనిత గాత్రాలు మామూలే. రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం బావుంది.

ఆరుడుగుల అందగ్గాడు, నన్ను బార్బీ గర్ల్ అన్నాడు :
            దేవిశ్రీ ‘డియ్యాలో... డియ్యాలో’. వంటి పాట ఇది.

నీ చూపుల పొంగిన పొగరు :
          బావుంది.  రామజోగయ్య శాస్త్రీ సాహిత్యానికి, దేవిశ్రీ సంగీతం ప్రాణం పోసింది.

నీటిలోని చాపొచ్చీ... నేలమీద పడ్డట్టూ... [దేవిశ్రీ, గీతా మాధురి ]
         ప్రభాస్ ట్రేడ్ మార్క్ ‘డార్లింగ్’ చుట్టూ రామజోగయ్య శాస్త్రీ అల్లిన ఈ పాటకు దేవిశ్రీ సంగీతమే కాదు, గాత్రం కూడా వినసొంపుగా ఉంది.
చివరగా :        రచయిత స్థానానికి రామజోగయ్యశాస్త్రి న్యాయం చేశారు. దేవీ సంగీతం  ప్రభాస్ అభిమానులనే కాదు అందరినీ  ఆకట్టుకుంటుంది.  
...avnk

No comments:

Post a Comment