Tollywood New Trend Single Hero With Two Heroines
తెలుగు సినీ పరిశ్రమ రోజు రోజు కీ ఒక అడుగు ముందే వేస్తోంది, అటుకధల దగ్గరి నుండి, ఇటు కధనం, నటీనటులు, హీరో హీరోయిన్ల ఎంపిక, సంగీతం, ఇలా ప్రతీ విషయం లో ప్రయోగాలు సృష్టిస్తూనే ఉంది. అయితే, ఇందులో కొన్ని ప్రయోగాలు సఫలం అవుతున్నాయి, మరికొన్ని పరాజయం పాలు అవుతున్నాయి. ఏది ఏమయినా, ప్రయోగాలు మాత్రం ఆగడం లేదు. అలా, ఈ సంవత్సరం మన ముందుకు రాబోతున్న ఇంకొక ప్రయోగం, దాదాపు ప్రతీ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు...
రాబోయే, నాయక్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో, అటు కధాపరంగా, ఇటు ఇద్దరు హీరోయిన్లు ఉంటె సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందనో, ఈ రెండు సినిమాల్లోనూ ఇద్దరు హీరోయిన్లు ఆది పాడు తున్నారు... ఇక రాబోయే బడా స్టార్ ల సినిమాల్లో కూడా, దాదాపు అన్ని సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు తమ సత్తా ని చాటడానికి సిద్ధం అయిపోతున్నారు... అల్లు అర్జున్ 'ఇద్దరంమాయిలతో', రామ్ చరణ్ 'ఎవడు', పవన్ స్టార్ - త్రివిక్రమ్ ల సినిమా, నాగార్జున - దసరత్ ల సినిమా, ప్రభాస్ 'మిర్చి'... ఇలా ఒకటేమిటి, స్టార్ హీరోలు అందరు ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చెయ్యబోతున్నారు... రవి తేజ తదుపరి చిత్రం 'బలుపు' లో కూడా, ఇద్దరు హీరోయిన్లతో కనిపిస్తాడు మాస్ మహా రాజ.
ఎటొచ్చి, N.T.R. మాత్రం, ఇప్పుడు 'బాద్షా' లో, హరీష్
శంకర్ దర్సకత్వం లో తానూ నటించబోయే ఇంకొక చిత్రంలో ఒకే హీరోయిన్ చాలు అని
దిసయిడ్ అయ్యాడు... ఈ ఇద్దరు హీరోయోన్ల ట్రెండ్ చూస్తుంటే, ఇప్పుడప్పుడే ఆగేలా లేదు.
No comments:
Post a Comment