Friday, 18 January 2013

Jr NTR Family

NTR2
NTR1
  
      సినీ.. రాజకీయ రంగంలో సంచలనాలు నమోదు చేసి చరిత్రకెక్కారు స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్). సినీ రంగాన పౌరాణిక ... జానపద ... సాంఘిక ... చారిత్రకాలపై చెరిగిపోని ముద్రను వేశారు. కాలేజ్ రోజుల నుంచే నటన పట్ల మక్కువ పెంచుకుని రంగస్థలంపై నాటకాలు వేసే ఆయన, 1949 లో 'మనదేశం' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత ఆయన పోషించిన 'పాతాళ భైరవి' , 'మల్లీశ్వరి', 'పెళ్లిచేసి చూడు' చిత్రాలు ఘన విజయాన్ని సాధించడంతో, ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఎన్నో ఆణిముత్యాలవంటి చిత్రాలు ఆయన 'అభినయ పొది'లో అలా అలా ఒదిగిపోతూ వచ్చాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే, తెరపై పనివాడి పాత్ర నుంచి పరమాత్ముడి పాత్ర వరకూ ఆయన పోషించనీ, మెప్పించని పాత్ర లేనేలేదు. ఆ చరిత్ర పురుషుడి వర్ధంతి ఇవాళ. ఈ సందర్భంగా ఆ మహానటుడిని మనసారా స్మరించుకుంటోంది తెలుగువిశేష్.కాం
             ఎన్టీఆర్ 17వ వర్థంతి సందర్భంగా ఈ (శుక్రవారం) ఉదయం హైదరాబాద్‌ రసూల్‌పురలోని ఎన్టీఆర్ విగ్రహానికి సినీనటుడు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణీత, ఇతర నందమూరి కుటుంబ సభ్యులు  సందర్శించి నివాళులర్పించారు. ఆ సందర్భంలోనివే ఈ చిత్రాలు..
NTR3
NTR4
NTR5
...avnk

No comments:

Post a Comment