Monday, 28 January 2013

Shruti Haasan Birthday Special


110

       గబ్బర్ సింగ్ విజయంతో నాకు తత్వం బోధపడింది ఇక కెరీర్ లో దూసుకుపోతానంటోంది తన పుట్టినరోజు సందర్భంగా అందాల నాజూకు భామ శృతి హాసన్. 1986 జనవరి 28న తమిళనాడులోని చెన్నపట్ణంలో శృతి జన్మించింది. యాక్ట్రస్.. సింగర్.. మోడల్.. మ్యూజిక్ కంపోజర్.. డ్యాన్సర్.. ఇలా విభిన్న రంగాల్లో దూసుకుపోతోంది శృతి హాసన్. ఇక ప్రస్తుతం రూటు మార్చిన ఈ భామ తన అభిరుచికన్నా ప్రేక్షకుల మెప్పుపొందే పాత్రలే మీద ద్రుష్టి పెడితే మంచిదని తనకు పవన్ సినిమాతో అర్థమైందని అందులో భాగంగానే చరణ్ ‘ఎవడు’,  రవితేజ ‘బలుపు’, ఎన్టీఆర్ తో నటించే మూవీ లోనూ తన పాత్ర, నటనాతీరు ఉంటుందని బర్త్డే చిట్ చాట్ లో పేర్కొంది.
        ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు, హిందీలో రెండు సినిమాలు చేస్తోన్న శృతి త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జోడీ కడుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రంలో ఓ కథానాయికగా నటించడానికి శృతి తాజాగా సంతకం చేసిన విషయం మనకు విదితమే. ఇప్పటికే హరీష్ శంకర్, ఎన్టీఆర్ ల చిత్రం తొలి షెడ్యూలు షూటింగు ఇటీవలే పూర్తయింది. మలి షెడ్యూలు 'బాద్ షా' పూర్తయిన వెంటనే మొదలవుతుంది. అప్పటినుంచి తాను ఎన్టీఆర్ తో షూటింగ్ లో పాల్గొంటానంటోంది శృతి హాసన్.
111
         కేవలం నటనే కాదు తండ్రి కమల్ లాగానే ఇంకా చాలా కళల్లో తనకు ప్రవేశం ఉందంటోంది శృతి. వెండితెరపై కనిపించక ముందే సంగీత ప్రదర్శనలిస్తూ, తండ్రి సినిమాలతో పాటు 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' వంటి సినిమాల్లో తన గాత్ర మాధుర్యాన్ని వినిపించానని,  కమల్ సినిమా 'ఈనాడు'కు సంగీత దర్శకురాలిగా కూడా వ్యవహరించానని శృతి చెప్పుకొస్తోంది.  'లక్' సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసి ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళ సినిమాల్లో బిజీగా వున్న శృతి హాసన్ ను మరిన్ని విజయాలు వరించాలని తెలుగువిశేష్.కాం ఆకాంక్షిస్తోంది.
...avnk

No comments:

Post a Comment