Monday, 21 January 2013

Kriti Kharbhanda Interview


 

 

kri-1.1
  
      యంగ్ అండ్ యనర్జిటిక్ హీరో రామ్ – హాట్ బ్యూటీ కృతి కర్బంద జంటగా నటించిన చిత్రం 'ఒంగోలు గిత్త'. 'బొమ్మరిల్లు' భాస్కర్‌ దర్శకత్వంలో బి.వి.యస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.  త్వరలో ప్రేక్షకులముందుకు రాబోతోన్న ఈ చిత్ర విశేషాలు తన ఫ్యూచర్ ప్రాజక్ట్స్ గురించి అందాల భామ కృతి తన మనసులో మాటలు బయటపెట్టింది.. ‘తనకు ఈమూవీ మంచిపేరు తెచ్చిపెడుతుంది. నిజజీవితానికి 50 శాతం దగ్గరగా ఉండే పాత్రను 'ఒంగోలు గిత్త' చిత్రంలో చేశాను. నా పాత్ర పేరు సంధ్య. చాలా చిలిపిగా, చురుకుగా, హుషారుగా ఉండే చాలామాస్‌ అమ్మాయిగా కనిపిస్తాను. మా తల్లిదండ్రులకు సైతం నా పాత్ర ఎంతగానో నచ్చింది. అయితే రామ్‌ పాత్ర పేరేంటి అన్నది సస్పెన్స్‌. సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఎనర్జిటిక్‌ హీరో అయిన అతని సరసన నటించడం నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. చక్కటి అభినయాన్ని కనబరచడంతో పాటు మంచి టైమింగ్‌ ఉన్న నటుడాయన. అంతేకాదు డ్యాన్స్‌ లు సైతం బ్రహ్మాండంగా చేశారు. ఈ చిత్రంతో నేను రామ్‌ అభిమాని కూడా అయ్యాను.

        kri-22ఇక భాస్కర్‌ అద్భుతమైన టేకింగ్‌ ఒంగోలుగిత్త చిత్రానికి ఎంతో వన్నెతెచ్చింది. ప్రేక్షకులను ఎంతగానో అలరించేవిధంగా అతను చిత్రాన్ని అంతబాగా మలిచారు. నిర్మాత బి.వి.యస్‌.ఎన్‌.ప్రసాద్‌ గురించి చెప్పాలంటే...ఆయన ఎప్పుడూ నవ్వుతుంటారు. ఇంత మంచి ప్రాజెక్టులో చేసిన మధురానుభూతి నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ చిత్రం కోసం మిర్చి యార్డులో నేను కేవలం రెండు రోజుల షూటింగ్‌లో పాల్గొన్నాను. అదే రామ్‌ అయితే 22 రోజుల మిర్చి యార్డు చిత్రీకరణలో ఆ ఘాటు తట్టుకుని ఎలా పాల్గొన్నారో తలచుకుంటే ఆశ్చర్యం కలగకమానదు.

          తీన్‌మార్‌, మిస్టర్‌ నూకయ్య, ఓం' చిత్రాలలో వేరే కథానాయిక స్థానంలో నన్ను ఎంపికచేయటంలో  నా ప్రమేయం ఏముంటుంది. వారు నన్ను ఎంపికచేశారు కాబట్టి ఆయా చిత్రాల్లో నటించాను. ముందు ముందు నన్ను కూడా ఎవరైనా రీప్లేస్‌ చేయవచ్చునేమో.. ఏ భాషలో మంచి స్క్రిప్టు, మంచి పాత్ర లభిస్తే వాటిలో నటిస్తాను. ఫలానా భాషలోనే నటించాలన్న నియమం ఏమీలేదు. కన్నడంలో మంచి పాత్రలు వచ్చాయి కాబట్టి అక్కడ ఎక్కువ చిత్రాలు చేశాను, చేస్తున్నాను. ప్రస్తుతం మూడు కన్నడ చిత్రాలలో నటిస్తున్నాను. తాజాగా నేను నటించిన కన్నడ 'సుబ్రమణ్యపుర' చిత్రం 60 రోజులు పూర్తిచేసుకుని కూడా విజయవంతంగా ప్రదర్శింపబడటం ఈ నూతన ఏడాది కానుకగా నేను భావిస్తున్నాను. నేను రాసిన ఓ స్క్రిప్టు కూడా కన్నడంలో తెరకెక్కబోతోంది. స్వతహాగా నేను పంబాజీ అమ్మాయిని అయినప్పటికీ, కన్నడం చదవడం, రాయడం నేర్చుకున్నాను. వాస్తవానికి తెలుగుతో పోల్చుకుంటే కన్నడం చాలా కష్టమనిపించింది. ఎందుకుంటే కన్నడంలో సంస్కృతం ఎక్కువగా కలుస్తుంది.

        పవన్‌కల్యాణ్‌ సరసన 'తీన్‌మార్‌'లో నటించడాన్ని ఓ అదృష్టంగా భావించాను. ఇంకా చెప్పాలంటే...నేను ఆయన అభిమానిని. ఇక కల్యాణ్‌రామ్‌ 'ఓం' 3డి చిత్రం. సాంకేతికంగా ఎంతో గొప్పగా తీస్తున్నారు. ఆ చిత్రంలోని పాత్ర కూడా నాకెంతో పేరు తెచ్చిపెడుతుంది’. అని తనమనసులోని ఎన్నో మాటలను కృతి కర్బంద పంచుకున్నారు. రాబోయే ఆమె ప్రాజక్ట్స్ అన్నీ విజయవంతం కావాలని మనమూ కోరుకుందాం..
...avnk

No comments:

Post a Comment