Friday, 22 February 2013

Amala Paul To Pair Up With Jr NTR


ntr_amala

మలయాళీ బ్యూటీ అమలాపాల్ ఈ మధ్యన తెలుగు ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కెరియర్ ప్రారంభంలో చిన్న హీరోలతో జత కట్టిన అమలాకి ఆ సినిమాలు ఏమాత్రం బ్రేక్ ఇవ్వలేకపోయినా, ఆ మధ్యన లక్ కొద్ది రామ్ చరణ్ సరసన ‘నాయక్ ’ సినిమాలో ఛాన్స్ కొట్టేసి అగ్రహీరోల ప్రక్కన స్థానం సంపాదించుకుంది. ఆ సినిమా విజయం సాధించడంతో ఇప్పుడు అమలా పాల్ కి మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘ఇద్దరు అమ్మాయిలతో ’ సినిమాలో నటిస్తుంది. ఇక తాజాగా ఫిలింనగర్ వార్తల ప్రకారం మాస్ హీరో ఎన్టీఆర్ సినిమాలోనూ ఎంపికయినట్టు తెలుస్తోంది. ఈ మధ్యనే బన్నీ షూటింగ్ స్పాట్ కి వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ అమలా పాల్ అందాలకు ఫిదా అయిపోయి ఈమెతో ఓ సినిమా చేయాలని అనుకున్నాడట. ఇక అమలాపాల్ ఎన్టీఆర్ కి ఫ్లాట్ అయిపోయి తొలి కలయికలోనే బెరుకు లేకుండా మాట్లాడటమే కాకుండా, తన సినిమాలో ఓ ఛాన్స్ ఇవ్వమని నిర్మొహమాటంగా అడిగేసిందట. ఎన్టీఆర్ ఒప్పుకోవడంతో ఈమె తరువాత సినిమాలో ఎన్టీఆర్ తో జతకట్టనుందని సమాచారం.

No comments:

Post a Comment