Tuesday, 12 February 2013

Shadow Movie Audio Function

Shadow-Movie-New-Posters

       విక్టరీ వెంకటేష్‌, అందాల తార తాప్సీ జంటగా మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో పరుచూరి శివరామప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'షాడో'. ఈ  చిత్రం వచ్చే నెల్లో విడుదల కోసం శరవేగంగా సిద్ధమవుతోంది. ఈ సినిమాలో శ్రీకాంత్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. పరుచూరి కిరీటి సమర్పిస్తున్నారు. మాస్‌ తో పాటు ఫ్యామిలీని ఆకట్టుకునే అంశాలు మేళవించి ఈ మూవీ రూపొందిస్తున్నారు. థమన్‌ సంగీతం అందించారు. ఇటీవల రిలీజైన టీజర్‌కి, ముఖ్యంగా టైటిల్‌ ట్రాక్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది.
      ఈ సందర్భంగా దర్శకుడు మెహర్‌ రమేష్‌ మాట్లాడుతూ ‘అన్ని వర్గాల వారినీ దృష్టిలో పెట్టుకుని చిత్రీకరించాం. వినోదం కలగలసిన యాక్షన్‌ సినిమా ఇది. మలేషియాలో ఛేజ్‌ సీన్‌ను వెంకటేష్‌, శ్రీకాంత్‌ రిస్క్‌ తీసుకుని చేశారు. నాగబాబు, ఎమ్మెస్‌ నారాయణ పాత్రలు మెప్పిస్తాయి. వెంకటేష్‌ గారితో పూర్తిస్థాయి కమర్షియల్‌ చిత్రాన్ని చేయాలని ఎప్పట్నుంచో అనుకున్నాను. అది ఇప్పటికి నెరవేరింది' అన్నారు. 


       నిర్మాత మాట్లాడుతూ ‘సినిమా చక్కగా వచ్చింది. ఎడిటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్‌ జరుగుతోంది. మార్చి7న శిల్పకళావేదికపై షాడో ఆడియో వేడుకని నిర్వహించనున్నాం. అదే నెల 27నగానీ, 29న గానీ సినిమాను విడుదల చేస్తాం. 'సింహా' ను దాటి పెద్ద చిత్రంగా నిలుస్తుంది. సింగిల్‌ సిట్టింగ్‌లో వెంకటేష్‌గారు కథను ఓకే చేశారు. ఆయనలోని మాస్‌ కోణాన్ని చూపించే సినిమా ఇది అని తెలిపారు. అలాగే-హై ఓల్టేజ్‌ స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇది. వినోదానికి పెద్దపీట వేసి రూపొందించాం’ అన్నారు.
         మధురిమ, ఎమ్మెస్‌ నారాయణ, నాగబాబు, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్య మీనన్‌, ధర్మవరపు, ముఖేష్‌రుషి, ప్రభు, శ్రీనివాసరెడ్డి, తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ:కోన వెంకట్‌, గోపిమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, మెహర్‌ రమేష్‌, పాటలు: చంద్రబోస్‌, రామ జోగయ్యశాస్త్రీ, కెమెరా:ప్రసాద్‌ మూరెళ్ల, సంగీతం: థమన్‌, ఫైట్స్‌:రామ్‌-లక్ష్మణ్‌,హ్యారీ (సిడ్నీ), ఎడిటింగ్‌: మార్తాండ్‌.కె, డ్యాన్స్‌: రాజు, కథనం-దర్శకత్వం:మెహర్‌ రమేష్‌.
...avnk

No comments:

Post a Comment