హీరో
జగపతి బాబుకు త్వరలో మామ పోస్టు కు ప్రమోషన్ వస్తుందట. అంటే జగపతి
బాబు కూతురికి త్వరలో పెళ్లి చేయబోతున్నాడు అనే మాటలు టాలీవుడ్ లో సందడి
చేస్తున్నాయి. టాలీవుడ్ పెద్దలు కూడా ఈ వార్త విని ఆశ్చర్యపోతున్నారు.
సన్నగా, హీరోల ఉండే జగపతి బాబుకు పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయి ఉందా?
అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు చాలా మంది జగపతి బాబుకు
ఇంక పెళ్లి కాలేదని కొంతమంది హీరోయిన్లు చాటు మాటుగా, జగపతి బాబుకు
వలవేస్తున్నారనే పుకార్లు ఉన్నాయి. ఆ మధ్యకాలంలో విమలరామన్ జగపతి బాబుల
మధ్య ఒక బాబు పుట్టే కేమిస్ట్రీ జరిగినట్లు సమాచారం, త్వరలో ఈ ఇద్దరు
పెళ్లి చేసుకోబోతున్నరనే పుకార్లు టాలీవుడ్ లో షికార్లు చేశాయి. అంతకు
ముందు ప్రియమణితో జగపతి బాబు ప్రేమయాణం నడిపినట్లు సినీ జనాలు
గుసగుసలాడుకున్నారు.
కానీ ఇప్పుడు జగపతి బాబు కూతురికి పెళ్లి అనే విషయం తెలుసుకున్న చాలా మంది ఆశ్చర్యంతో ఆయనకు ఫోన్ చేసి అడుగుతున్నారట. జగపతి బాబు ఆశ్చర్యంతో అవును, నాకు పెళ్లి అయ్యింది, త్వరలో నా కూతురికి పెళ్లి చేస్తున్నానని చెప్పటంతో... అవతలి పోన్ కట్ అవుతుందట. అంటే అవతలి వారి గొంతు మూగబోతుందని జగపతి బాబు సన్నిహితులు చెబుతున్నారు. అయితే జగపతి బాబు ఫోన్లు చేస్తుంది ఎక్కువుగా అమ్మాలేనట. జగపతిని పతిగా చేసుకోవటానికి చాలా మంది అమ్మాయిలు ఎదురు చూస్తున్నట్లుగా .. ఈ ఫోన్ల ద్వారా తెలిసిపోయిందని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. జగపతి బాబు భార్య మాత్రం చాలా ఆశ్చర్యపోతుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
No comments:
Post a Comment