Friday, 1 February 2013

Anushka Avoids Ranveer


ranveer-singh_anushka-sharma

   బాలీవుడ్ అనుష్క శర్మకు బాయ్ ఫ్రెండ్ ఫై మోజు తీరిందా ? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. అనతి కాలంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి వచ్చిన అనుష్క శర్మ యంగ్ హీరో రణ్ వీర్ కపూర్ తో కలిసి ‘బ్యాండ్ బాజా భారత్ ’ సినిమా షూటింగు అప్పటి నుండి వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందనే విషయం బాలీవుడ్ జనాలందరికీ తెలుసు. ఆ తరువాత నుండి పార్టీల్లో, పబ్బుల్లో చెట్టాపట్లాలేసుకొని తిరిగిన వీరిద్దరు ఈ మధ్య కాలంలో ఎడ మొహం, పెడ మొహంగా ఉంటున్నారట. దీనికి సాక్ష్యం ఈ మధ్య వీరిద్దరు ఓ పంక్షన్ కి ఒకేసారి వచ్చారట. దీంతో అనుష్క తన కంటే ముందు కారు దిగిన రణవీర్ లోపలికి వెళ్ళాడా లేదా అని ఓ పనిషిని పంపించి అతను వెళ్లి పోయాడని తెలుసుకున్న తరువాత ఈమె కారు దిగి వెళ్లి పోయిందట. మరి వీద్దరి మధ్య ఇంత అగాధం ఏర్పడటానికి కారణం బాలీవుడ్ అందాల సుందరి దీపికా పడుకునే అని అనుకుంటున్నారు. ఈ మధ్య రణవీర్ ఈమెతో చనువుగా ఉండటమే అనుష్క కోపానికి కారణం అంటున్నారు. కారణం ఏమైనా, అనుష్కకు మోజు తీరిపోయిందట తరువాత ఇతడ్ని వదిలేసిందని అనుకుంటున్నారు.

No comments:

Post a Comment