హిందీ లో మళ్ళీ తన అదృష్టాన్ని
పరీక్షించుకోనున్న తమన్నా, ఇన్ని సంవత్సరాల తరువాత హిందీ లో తనకు దక్కిన
అవకాసం, 'హిమ్మత్ వాల' లో పూర్తిగా సద్వినియోగం చేసుకుంటోంది. తన ఈ చిత్రం
విడుదల కాక ముందే హిందీ పరిశ్రమలో బడా హీరోల దృష్టిని ఆకర్షించింది తమన్నా.
కేవలం, 'హిమ్మత్ వాల' నిర్మాత తో తాను రాసుకున్న అగ్రిమెంట్ కారణంగానే, ఈ
చిత్రం విడుదల వరకు వేరే ఏ చిత్రం ఒప్పుకోకుండా, కాస్త కామ్ అయిపొయింది
తమన్నా... ఒక్క సారి ఈ చిత్రం విడుదల అయితే ఇక వరుస అవకాశాలు తమన్నా సొంతం
అంటున్నాయి హిందీ సినీ వర్గాలు. అటు స్టార్ హీరోల నుండి ఇటు కొత్త హీరోల
వరకు, ప్రతి ఒక్కరు, తమన్నా తో కలిసి నటించాలని మొగ్గు చూపుతున్నారట.ఒక
వైపు సాంకేతిక ప్రకటనల్లో నటించడం లో, మరో వైపు షాపుల వోపెనింగ్ లో బిజీ గా
ఉంది తమన్నా. ఈ మధ్యనే హిమ్మత్ వాల ట్రయిలర్ విడుదల అయ్యింది... ఇందులో
అలనాటి ఈ చిత్రం లో హీరోయిన్ శ్రీదేవి నటించిన పాటలో అచ్చం అలాంటి దుస్తులే
ధరించి తమన్నా కూడా ఆది పాడటం కనిపించింది. కనిపించింది అర క్షణమే అయిన,
తమన్నా రంగు, నాట్య విన్యాసాలు ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకున్నాయి.
చిత్రం లో తమన్నా నటన కూడా ఎంతో బాగుంటుందని అంటున్నారు, యూనిట్ సభ్యులు.
ఇక నేఁ, తన నటనతో అబ్బురపరిచే నాట్యం తో తమన్నా హిందీ చిత్ర సీమ లో కూడా ఒక
వెలుగు వేలుగుతుందన్నమాట.
No comments:
Post a Comment