వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కధానాయిక,
శ్రుతి హస్సన్... గత సంవత్సరం విడుదల అయిన 'గబ్బర్ సింగ్' శ్రుతి హస్సన్
దసనే మార్చేసింది. ఇప్పుడు ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ల జాబితా లో
చేరిపోయింది. వరుసగా స్టార్ హీరోల పక్కన అవకాశాలు సంపాదించుకుంటూ, ఇటు
తెలుగు లో అటు హిందీ లో కూడా బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు లో
ఇప్పుడు రవి తేజ సరసన, రామ్ చరణ్ సరసన నటిస్తోంది. అయితే ఈ మధ్యనే వచ్చిన
ఒక వార్తకు శ్రుతి వెంటనే స్పందించింది. N.T.R - హరీష్ శంకర్ల సినిమాలో
శ్రుతి హస్సన్ హీరోయిన్ గా నటిస్తోందని వార్త వచ్చింది. మరి హీరోయిన్ గా ఈ
సినిమాలో ఎంపిక అయిన సమంత పరిస్థితి ఏమిటి? ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లా?
శ్రుతి మెయిన్ హీరోయిన్ ఆ, లేక సెకండ్ హీరోయిన్ ఆ? ఇటు వంటి
ప్రశ్నలన్నిటికీ చెక్ పెట్టింది, శ్రుతి సమాధానం. తాను ఈ చిత్రం లో
నటిస్తున్న మాట నిజమే అని అయితే కేవలం అతిధి పాత్రలోనే కనిపించబోతున్నా అని
స్పష్టం చేసింది శ్రుతి...
రామ్ చరణ్ 'ఎవడు' లో ముందు సమంత ని
అనుకుని, తెలియని కారణాల వల్ల ఆఖరి నిమిషం లో శ్రుతి ని ఫైనల్ చేసారు...
ఇప్పుడు ఈ సినిమా లో కూడా ఇలాంటిదే జరిగిందేమో అనుకున్నారు అంతా, కానీ
శ్రుతి చెప్పడం వల్ల, అందరి ఆలోచనలు అపశ్రుతి పాలు కాకుండా ఉండగాలిగాయి
No comments:
Post a Comment