ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఇద్దరు
హీరోయిన్లను పెట్టడం కామన్ అయిపోయింది. అయితే కొన్ని సినిమాల్లో ఇద్దరికి
సమ ప్రాధాన్యం ఉన్న పాత్రలు వస్తాయి. అలా ప్రాధాన్యం లేని పాత్రలు
దొరికినప్పుడు తనకు పేరు రావడానికి హీరోయిన్లు తమ అందాల ఆరబోతకు ప్రాధాన్యం
ఇస్తారు. ఇప్పుడు కూడా అలాంటిదే జరుగుతుంది. తమిళ స్టార్ సూర్య హీరోగా
రూపొందుతున్న సింగం-2 సినిమాలో అనుష్క, హన్సిక కథానాయికలుగా
నటిస్తున్నారు.
అందాలతో అభిమానుల మతులు పోగొట్టడంలో వీరిద్దరూ సాటిలేని
వారే. అందుకే, వీరిద్దరూ కూడా ఎవరికి వారు మరొకర్ని డామినేట్ చేయాలని పోటీ
పడుతున్నారట. ఈవిషయం పై అనుష్క ఓ సందర్భంలో మాట్లాడుతూ.... ఇందులో కథే
కీలకం, అందాల ఆరబోత ముఖ్యం కాదు అని, అయినా కథా బలం లేనప్పుడు ఎన్ని అందాలు
ఆరబోస్తే ఏంటి అంటూనే తొలి సగ భాగంలో మాత్రం కోరుకున్నన్ని అందాలు
చూడవచ్చిని అసలు గుట్టు విప్పింది. సో... ఈ సినిమాకి వెళితే అనుష్క, హన్సిక అందాల విందు
ఆరగించవచ్చన్న మాట.
No comments:
Post a Comment