Wednesday, 6 February 2013

Prayamani Item Number In Sharukh Movie

 

Priyamani__rocking_hot_10

       తన అద్భుతమైన నటనాపటిమతో టైటిల్ లీడ్ రోల్స్ చేస్తోన్న అందాలతార ప్రియమణి మరోసారి బాలీవుడ్ తెరపై ప్రత్యక్షం కానుంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్‌ఖాన్ సరసన హాట్ హాట్ ఐటెం చేయబోతోందీ అమ్మడు.  షారూఖ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘చెన్నై ఎక్స్‌ ప్రెస్’లో షారూఖ్‌ఖాన్‌ తో కలిసి ప్రియమణి హాట్ హాట్ ఐటెం చిందేంయబోతోంది. ముంబయ్ నుంచి రామేశ్వరం వెళ్తున్న కథానాయకుడికి  మార్గమధ్యంలో ప్రియ తారసపడి తన ఒంపుసొంపులు ఒలకబోస్తుంది.
        కాగా,  కేవలం నాలుగు నిమిషాల ఈ పాట కోసం ప్రియమణి 30 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్టు సమాచారం. అంటే ఓ సినిమాకు ఈ అమ్మడికి ఎంత ఇస్తున్నారో అంతే మొత్తాన్ని ఒక్క పాటకు తీసుకోనుందన్నమాట. దీపికా పదుకునే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మొదట షారూఖ్‌ఖాన్‌తో నయనతారను ఐటమ్‌సాంగ్‌లో నటింప చేసే ప్రయత్నాలు జరిగాయి. నయనతార నిరాకరించడంతో ఇప్పుడు ప్రియమణిని ఎంపిక చేశారు.  
        ఒకవైపు షారూఖ్ తో బాలీవుడ్ లో అవకాశం.. మరోవైపు బంపరాఫర్... ఏమైనా ప్రియమణికి ప్రజంట్ డేస్ బాగున్నట్టున్నాయి. తెలుగులో కూడా వరుసపెట్టి సినిమాలు వచ్చేస్తున్నాయి కూడా కదా.. అన్నట్టు ఈ ముద్దుగుమ్మ ఇంతకుముందు రావణ్ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. 
...avnk

No comments:

Post a Comment