విలక్షన నటుడు కమల్ హాసన్ కి ఇద్దరు
కుమార్తెలలో పెద్ద కూతురు శ్రుతి హాసన్ హీరోయిన్ గా ఎంట్రీ తనదైన శైలిలో
దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక చిన్న కూతురు అక్షర హాసన్ వెండితెర పై
ఇంకా తెరంగ్రేటం చేయలేదు. కానీ ఈ అమ్మడు అప్పుడే ఎఫైర్లు నడుపుతుందని
బాలీవుడ్ లో కోడై కూస్తున్నారు. ఈమె ప్రేమించేది ఎవర్నో కాదు... ప్రముఖ
నటుడు నసీరుద్దీన్ షా తనయుడు వివాన్ తో అక్షర ప్రేమాయణం నడుపుతుందట.
వీరిద్దరు ఎక్కడికి వెళ్లినా ఒకర్ని విడిచి ఒకరు ఉండటం లేదట. ఈ వార్తలకు
బలం చేకూరే విధంగా నజీరుద్దీన్ షా కూడా ద్రువీకరిస్తూ..... వీరిద్దరూ కలిసి
తిరగడం నేను కూడా చూశానని అన్నాడు. ఇక ఈ విషయం అక్షర అక్క అయిన శ్రుతి
హాసన్ కి కూడా తెలుసునని అంటున్నారు. అక్షర, శ్రుతి వివాన్ ని
కలుస్తుంటారని కూడా అంటున్నారు. మరి ఈ విషయం పై ఎవరూ స్పందించక పోవడం
చూస్తుంటే వీరి వ్యవహారం ఇంట్లో అందరికీ తెలిసే ఉంటుందని అనుకుంటున్నారు.
No comments:
Post a Comment