సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల
మధ్య అప్పుడప్పుడు కోల్డ్ వార్ నడుస్తుంటుంది. కానీ హీరోల మధ్య అలాంటి
సందర్భాలు చాలా తక్కువ. కానీ ఇటీవల తెలుగు హీరో రాణా బాబు కోపానికి తమిళ
హీరో విక్రమ్ గురయ్యాడు. వీరిద్దరికి ఏంటి గొడవ అనేగా మీ సందేహం... తమిళ
స్టార్ గా పేరు తెచ్చుకున్న విక్రమ్ ఈ మధ్యన రానాబాబు పై నోరు జారడమే.
ఇటీవల ఈయన నటించిన ‘డేవిడ్ ’ సినిమా బాలీవుడ్ లో మంచి విజయం సాధించింది. ఈ
సందర్భంగా మీడియా దక్షిణాది హీరోలు ఎందుకని బాలీవుడ్ లో సక్సెస్
కాలేకపోతున్నారు?' అని విక్రమ్ ని అడగ్గా, సమాధానంగా హీరో రానాను ఉదహారణగా
తీసుకొని అతను తెలుగులో కెరీర్ మొదలుపెట్టాడు. కానీ అక్కడ సక్సెస్ కాలేదు.
అక్కడి నుంచి బాలీవుడ్ వచ్చాడు. నేనలా కాదు. దక్షిణాదిన మొత్తం వదులుకుని
బాలీవుడ్ వచ్చాను...' అంటూ చెప్పాడు.
దీంతో రానాకి ఎక్కడో కాలింది. దీంతో రానా
బాబు తన ట్విట్టర్ లో విక్రమ్ కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఆయన వ్యాఖ్యల
ప్రకారం.... ‘డియర్ మిస్టర్ విక్రం... ఈమధ్య మీరు నా గురించి మాట్లాడడం
మీడియాలో చూస్తున్నాను. అది మంచిది కాదు. పది పెద్ద ఫ్లాపులను వెనకేసుకున్న
మీరు, మీ కెరీర్ మీద దృష్టి పెట్టుకుంటే మంచిది. నేను వచ్చి రెండున్నర
ఏళ్ళే అయింది. మీరు పాతికేళ్ళ నుంచి ఇక్కడ వున్నారు. మీ పని మీరు చూసుకోండి
’. ట్వీట్ చేశాడు. ఈ వ్యాఖ్యలు చూసిన రానా ఫ్యాన్స్ విక్రమ్ కి గట్టి
వార్నింగ్ ఇచ్చారని ఫీడ్ బ్యాక్ కూడా ఇస్తున్నారట. మరి ఈ వ్యాఖ్యల పై రానా
ఏవిధంగా రియాక్ట్ అవుతాడో చూడాలి అంటున్నారు సినీ జనాలు.
No comments:
Post a Comment